బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 80వ పుట్టినరోజు నేడు. ఐదు దశాబ్దాల పాటు సాగిన ఆయన మూవీ కెరీర్ యావత్ జాతి హృదయాలను గెలుచుకుంది. 1984లో బచ్చన్ నటనకు విరామం ఇచ్చారు.తన చిరకాల కుటుంబ మిత్రుడు రాజీవ్ గాంధీకి మద్దతుగా రాజకీయాల్లోకి ప్రవేశించారట..8వ లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.


అయితే ఐదేళ్లు పూర్తికాక ముందే

జూలై 1987లో ఆయన తన సీటుకు రాజీనామా చేశారు. ఎందుకు అమితాబ్ ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు? అంటే.. బోఫోర్స్ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో అమితాబ్ రాజీనామా చేశారని కూడా చెబుతుంటారు. కానీ అంతకు మించిన ఒక కారణం ఉంది. అస్సాంలో జరిగిన చిన్న సంఘటనతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారట అదేంటో తెలుసుకుందాం ఇప్పుడు.


బచ్చన్ తన రాజకీయ జీవితం గురించి ఆలోచించేలా అస్సాంలో ఏమి జరిగింది? అనేది వెరీ ఇంట్రెస్టింగ్. అది కాంగ్రెస్ తరఫున అమితాబ్ అస్సాంలో ప్రచారం చేస్తున్న సమయం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి తప్పుడు సమాచారం అందటంతో అమితాబ్ ఒకచోట దిగాల్సింది మరోచోట దిగారు. అయితే ఆ స్థానంలో కాంగ్రెస్ కాకుండా మరో పార్టీ ప్రాబల్యం ఎక్కువగా ఉంది.మరో పార్టీ కార్యకర్తలు అమితాబ్ ఉన్న హెలికాప్టర్ ను చుట్టుముట్టే ప్రయత్నం చేశారట. దీంతో పైలట్ అకస్మాత్తుగా హెలికాప్టర్ ను స్టార్ట్ చేశాడు. స్థానికుల్లో ఒక యువకుడు ఎలాగోలా సెక్యూరిటీ వలయాన్ని ఛేదించి అమితాబ్ దగ్గరికి వచ్చాడు. అమితాబ్ చేతిలో ఒక కాగితం ముక్కను పెట్టాడు. ఈ కాగితం ముక్కే అమితాబ్ రాజకీయాల నుంచి తప్పుకునేలా చేసిందట.. అందులో ఏమని రాసుంది అంటే.. “అమితాబ్ గారు నేను మీ వీరాభిమానిని.కానీ నేను మీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలో ఉన్నాను. మీ వల్ల నేను మానసికంగా నలిగిపోతున్నాను. మా పార్టీ పై ఉన్న రాజకీయ అభిమానానికి, మీ పై ఉన్న వ్యక్తిగత అభిమానానికి మధ్య కొట్టుమిట్టాడుతున్నాను. దయచేసి నన్ను ఈ స్థితి నుంచి కాపాడండి” అని ఆ యువకుడు కాగితంపై రాశాడట.. దీన్ని చదివి భావోద్వేగానికి గురైన అమితాబ్ అభిమానుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీగా ఎన్నికైన నాలుగో సంవత్సరం లోనే (1987) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్లో అమితాబ్ తన బ్లాగ్ లో ఒక పోస్ట్ చేశారు. “25 ఏళ్ల పాటు అభిమానుల ప్రేమ కోసం సినీ రంగంలో పనిచేశాను. ఇప్పుడు నా రాజకీయ పార్టీని కూడా ప్రేమించమని వాళ్ళకు చెబుతున్నాను. ఇది నాకు నచ్చట్లేదు. ఇది తప్పు. దీనివల్ల నా అభిమానులకు బాధ కలుగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.


ఇటీవల కూడా పలు మీడియా ఇంటర్వ్యూలలో అమితాబ్ మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: