టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన అనుదీప్ కేవీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు జాతి రత్నాలు మూవీ తో అద్భుతమైన విజయాన్ని మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను దక్కించుకున్నాడు. ఇలా జాతి రత్నాలు మూవీ తో దర్శకుడి గా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్న ఈ యువ దర్శకుడు ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్నటు వంటి హీరోలలో ఒకరు అయిన శివ కార్తికేయన్ హీరోగా "ప్రిన్స్" అనే మూవీ ని తెరకెక్కించాడు.

మూవీ ని తమిళ మరియు తెలుగు భాషల్లో తెరకెక్కించారు. అక్టోబర్ 21 వ తేదీన ఈ మూవీ ని తమిళ్ మరియు తెలుగు లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రాలు ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను తాజాగా పూర్తి చేసింది.

మూవీ కి సెన్సార్ బోర్డు నుండి క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ సినిమా 2 గంటల 23 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: