టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే . ఇక కొన్ని నెలలుగా హరీష్ శంకర్ నుంచి రానున్న అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ అనే పేరుతో ఒక భారీ ప్రాజెక్టును రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టును ప్రకటించి ఏడాది పైనే కావస్తోంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా పట్టాలెక్కడానికి కాస్త సమయం పడుతుంది. ముఖ్యంగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు భారీ స్థాయిలో ఈ సినిమా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు కానీ ముందుకు కదలడం లేదు..


ఇప్పటికే హరీష్ శంకర్,  పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.  దీంతో మరొకసారి ఈ కాంబో రిపీట్ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు మొదలవుతుందా ? అని తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  అంతేకాదు పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో ఎలా చూపించబోతున్నారు అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. ప్రస్తుతం రాజకీయాలను పక్కనపెట్టి పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ రీమేక్లపై దృష్టి పెట్టడం..  క్రిష్ చేస్తున్న హరిహర వీరమల్లు..ఇంకా అండర్ ప్రొటెక్షన్ లోనే ఉండడంతో హరీష్ శంకర్ తన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది..

ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించబోయే భవదీయుడు భగత్ సింగ్ సినిమా గురించి అభిమానులు ఆనందపడే విషయాన్ని హరీష్ శంకర్ అందించారు. ఇటీవల పూజా హెగ్డే కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన హరీష్ శంకర్ త్వరలో మీతో కలిసి సెట్స్ లో వర్క్ చేయడానికి ఎదురుచూస్తున్నామంటూ భవదీయుడు భగత్ సింగ్ ప్రాజెక్ట్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే ఈ సినిమా మొదలు కాబోతోందని సమాచారం . ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: