అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాజేష్ అంటే ముందుగా గుర్తొచ్చేది నిలువెత్తు నటన మాత్రమే . గ్లామర్‌కి దూరంగా నటనకు ప్రాధాన్యత వున్న పాత్రలనే ఆమె ఎక్కువ ఎంచుకుంటూ వుంటుంది.

తమిళంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఐశ్వర్యా రాజేష్ తెలుగులో 'కౌసల్యా కృష్ణ మూర్తి' సినిమాతో తెరంగేట్రం చేసింది.

 
తొలి సినిమాకే మంచి పేరు దక్కించుకుంది ఈ బ్యూటీ . డీ గ్లామర్ రోల్ అయినా ఐశ్వర్యా రాజేష్ తెలుగు ప్రేక్షకులను బాగా ఎట్రాక్ట్ చేసింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది కూడా  టాలీవుడ్ లో .

ఇక, ఆ తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటించింది ఐశ్వర్యా రాజేష్. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లున్నప్పటికీ, ఐశ్వర్యా రాజేష్ పాత్ర గురించే  ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఐశ్వర్య రాజేష్ చిన్న పాత్రే అయినా, ఆమెతో నడిచిన ట్రాక్ గురించే ఎక్కువ పాజిటివ్ టాక్ వినిపించింది.

 

ఆ పై సాయి ధరమ్ తేజ్ సినిమా 'రిపబ్లిక్'లో  కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ . ఈ సినిమాలోనూ ఐశ్వర్య ఓ క్రిటికల్ క్యారెక్టర్ పోషించిందనే చెప్పాలి. ఇలా, తెలుగులో ఆమె నటించిన సినిమాలు తీసుకుంటే, ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా ఆమె టాలెంట్‌ని బయటికి తెచ్చే సినిమాలే వుంటాయ్.


అయితే, తాజాగా ఐశ్వర్యా రాజేష్ రూటు మార్చినట్లు కనిపిస్తోంది. కమర్షియల్ కంటెంట్‌పై కన్నేసినట్లు అనిపిస్తోంది. అందుకు కారణం సోషల్ మీడియాలో లేటెస్టుగా  తెగ చక్కర్లు కొడుతున్న ఐశ్వర్య రాజేష్ గ్లామర్ పిక్స్. ఎల్లో కలర్ మోడ్రన్ వేర్‌లో ఐశ్వర్యా రాజేష్ అలవోకగా అందాలారబోసిన ఫోటోలవి. డిఫరెంట్ డిఫరెంట్ గ్లామర్ పోజుల్లో ఐశ్వర్యా రాజేష్ చితక్కొటేసింది.

ఐశ్వర్యలో మంచి నటి మాత్రమే కాదు, ఇదిగో ఇలా తన లో, ఒక గ్లామర్ బొమ్మ కూడా దాగుందని తన పర్సనల్ పిక్చర్సస్ ఆమె నిరూపిస్తు ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: