"కాంతార".. ప్రస్తుతం ఇండియాని షేక్ చేస్తున్న సినిమా. ఈ సినిమా గురించి ఇంతగా మాట్లాడుకోవడానికి గల మొదటి కారణం రిషబ్ శెట్టి ఇంకా అతని డైరెక్షన్. ఈ సినిమాకు ఇతడే దర్శకుడు కూడా. సినిమాలో అతి ముఖ్యమైన ఒక పాత్ర లో కూడా రిషబ్ నటించాడు. ఎంతో అద్భుతమైన నటనతో సినిమాను ఇంటి చేత్తో లేపి నిల్చోబెట్టాడు.ఇక కథ రాసుకున్న విధానం కూడా మరొక ఖచ్చితమైన కారణం.అందుకే మైండ్ బ్లాంక్ అయ్యే బ్లాక్ బస్టర్ హిట్ ఐయింది.ఈ సినిమా తొలి భాగం అంతా ప్రేక్షకుడికి కథను పరిచయం చేసే పనిలోనే ఉన్నాడు దర్శకుడు. ఒక్క సారి జైలు నుంచి హీరో విడుదల అయ్యాక థియేటర్ లో పునకాలే. ఇది కదా సినిమా అంటే .. ఇది కథ సంప్రదాయం అంటే. కన్నడ చిత్ర పరిశ్రమ భారతీయ సంప్రదాయాలను , మూలలను సరికొత్తగా తెర పైన ఆవిష్కరిస్తూ తెలియచేస్తుండటం చాలా అద్భుతం.ఇక రొటీన్ రొట్ట కథలను చూడటం బోట్ కొట్టిస్తే ఇలాంటి నూతన అంశాలను, సున్నితమైన భావాలను తెలిపే సినిమాలు చూస్తే ఆ కిక్కే వేరు.


ఇక మొన్నటి వరకు హీరో ఉపేంద్ర కూడా ఇలాగే కొన్ని సరికొత్త సినిమాలను కన్నడ ఇండస్ట్రీ కి అందించాడు. ఆ తర్వాత యష్ హీరోగా వచ్చిన కెజిఎఫ్ సినిమాలు మరోమారు ఆ పరిశ్రమను దేశం మొత్తం తలెత్తుకునేలా చేసాయి. ఇక ఇప్పుడు కాంతార సినిమా ఖచ్చితంగా వీటన్నిటిని మించి ముందుకు పోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక మొన్న వచ్చిన కేజీఎఫ్ సినిమా మినహా అంతక ముందు కన్నడ సినిమాల గురించి మన తెలుగు వారు చర్చించిన దాఖలాలు తక్కువే.కానీ కాంతార మాత్రం ఒక అద్భుతమైన సినిమా.ఖచ్చితంగా ఇది ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా. కేవలం కన్నడిగులు మాత్రమే కాదు పురాతన ఆచార వ్యవహారాలను సంస్కృతిని ప్రతిబింబించే మరిన్ని సినిమాలు ఇప్పుడు బాగా హిట్ అవుతున్నాయి.హిట్ అవ్వాలి. ఇలాంటి సినిమాలే జనాలకు కావాలి. ఇలాంటి సినిమాలనే జనాలు బాగా ఆదరించి మన మూలాలను ప్రపంచానికి చాటి చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: