సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మించే ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం అందిస్తారు.బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ మరియు సక్సెస్ ట్రాక్ ఎక్కిన బాలయ్య కలిసి చేయనున్న NBK108 చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. అందులోనూ బాలకృష్ణ ను ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో చూపించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో వదిలిన అనౌన్స్ మెంట్ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది.అనిల్ బాలయ్య కోసం విభిన్నమైన మాస్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారని తెలుస్తోంది. తొలిసారి కామెడీకి ప్రాధాన్యత తగ్గించి ఓ పవర్ ఫుల్ సబ్జెక్టును రెడీ చేస్తున్నాడట.


 ఇది హీరో క్యారెక్టరైజేషన్ మీద కథ అని.. నందమూరి బాలయ్యతో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు.. ఎవ్వరూ చూడని కొత్త కోణంలో ఆయన్ని చూపించబోతున్నట్లు అనిల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఇప్పటి వరకూ కేవలం తెలుగులోనే సినిమాలు చేస్తూ వచ్చిన నందమూరి బాలకృష్ణ.. అనిల్ రావిపూడి సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.NBK108 చిత్రాన్ని దక్షిణాది భాషలతో పాటుగా హిందీలోనూ రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో.. పలువురు బాలీవుడ్ నటీనటులను భాగం చేయాలని చూస్తున్నారట.ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీలా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. యాభై ఏళ్ల వయసున్న తండ్రి పాత్రలో బాలయ్య కనిపిస్తే.. ఆయన కూతురుగా శ్రీలీల నటించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: