ఈ వారం "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోయే సినిమాల గురించి తెలుసుకుందాం.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడి గా , నిర్మాత గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసారా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో క్యాథరిన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించగా ,  మల్లాడి వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఆగస్టు 5 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ,  బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇలా థియేటర్ లలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ మూవీ ని అక్టోబర్ 21 వ తేదీ నుండి జీ 5   "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు , తమిళ్ , కన్నడ ,  మలయాళ భాషలో స్ట్రీమింగ్ కాబోతోంది.

విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగ ర్ మూవీ హిందీ వర్షన్ అక్టోబర్ 21 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో  స్ట్రీమింగ్ కాబోతుంది. కవి సామ్రాట్ మూవీ తెలుగు భాషలో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అక్టోబర్ 21 వ తేదీన స్ట్రీమింగ్ కాబోతుంది. కపట నాటక సూత్రధారి మూవీ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో అక్టోబర్ 21 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన కృష్ణ వ్రింథా విహారి మూవీ అక్టోబర్ 23 వ తేదీ నుండి తెలుగు భాషలో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. బెల్లంకొండ గణేష్ హీరోగా వర్షా బోల్లమ్మ హీరోయిన్ గా తెరకెక్కిన స్వాతి ముత్యం సినిమా తెలుగు భాషలో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అక్టోబర్ 24 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ott