సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించాలంటే అండదండలే కాదు.. అపారమైన ప్రతిభ ఉండాలి.. ఒక్కోసారి బ్యాక్రౌండ్ పెద్దగా ఉన్నా నటుడిలో టాలెంట్ లేకపోతే ప్రేక్షకులు ఆదరించరుఈశ్వర్' సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ ను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ 'ఛత్రపతి'లో ఆయన విశ్వరూపం చూపించడంతో అందరూ ఫిదా అయ్యారు. అప్పటి నుంచి ప్రభాస్ సినిమాలంటే పడి చస్తున్నారు. ఆడియన్స్ అభిరుచికి అనుగుణంగా కాలాన్ని బట్టి ప్రభాస్ సినిమాలు తీస్తున్నాడు. భారీ ప్రయోగాలు చేసి.. భారీ బడ్జెట్ సినిమాల హీరో అనిపించుకుంటున్నాడు. మొన్న టాలీవుడ్లో.. నిన్న పాన్ ఇండియా లెవల్లో . ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ప్రభాస్ కున్న క్రేజ్ మాములుది కాదనే చెప్పొచ్చు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే ఈ సందర్భంగా 'డార్లింగ్' గురించి కొన్ని విశేషాలు.

'ఈశ్వర్'తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మొదటి సినిమా సక్సెస్ అయింది. అయితే ఈ సినిమా కథ పరంగా ప్రేక్షకుల్లోకి వెళ్లింది. ఆ తరువాత రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడు ప్రభాస్ అని తెలిసిపోయాక అందరూ ఆశ్చర్యపోయారు. అచ్చం కృష్ణంరాజులాగే ఉన్నాడని అనుకున్నారు. అయితే ఆ సమయంలో రాఘవేంద్ర సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా ప్లాప్ కావడంతో ప్రభాస్ ను ఎవరూ గుర్తుపెట్టుకోలేదు. కానీ రాజమౌళి తీసిన 'చత్రపతి'తో ప్రభాస్ తన టాలెంట్ ను బయటపెట్టాడు. ఒక హీరోకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ సినిమా ద్వారా ప్రభాస్ లో కనిపించాయి. అప్పటి నుంచియంగ్ రెబల్ స్టార్ దశ తిరిగింది.

ఇక వెనుదిరిగి చూడకుండా మాస్ మూవీస్ లో నటించిన ప్రభాస్ ఫ్యామిలీ చిత్రాలకు కూడా సైన్ చేశాడు. ఆయన తీసిన 'మిస్ట్ ఫర్ఫెక్ట్' 'చక్రం' మూవీస్ ప్రభాస్ లోని నటుడిని వెలికితీశాయి. కానీ ఛత్రపతి సినిమా తో ప్రభాస్ దశ తిరిగింది. అప్పటి నుంచే ప్రభాస్ పై రాజమౌళి దృష్టి పడింది. ఆయనతో పాన్ ఇండియా లెవల్లో సినిమా తీయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అనుకున్నట్లుగానే భారీ మూవీ 'బాహుబలి'ని రెండు పార్టులు తీసి సంచలనం సృష్టించాడు. ఈ సినిమాతో ప్రభాస్ లెవల్ వరల్డ్ వైడ్ గా వెళ్లింది. ఈ సినిమా రెండు పార్టులు కలిపి 2000 కోట్ల వసూళ్లు చేయడంతో ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగింది.

అప్పటి నుంచి ఆయనతో భారీ బడ్జెట్ చిత్రాలే తీస్తున్నారు. 'బాహుబలి' తరువాత రూ.300 కోట్లతో 'సాహో' తీశారు. ఇప్పుడు రూ.500 కోట్ల తో ఇండియా లెవల్లో 'ఆదిపురుష్ 'ను తీర్చి దిద్దుతున్నారు. ఒక తెలుగు హీరో హీందీ సినిమాలో కీలకంగా కనిపించడం తెలుగు ఇండస్ట్రీకే గర్వకారణం. ఇవే కాకుండా ఆయన చేతిలో మరో భారీ మూవీ 'సాలార్' కూడా రెడీకి సిద్ధమవుతోంది.సినీ ఇండస్ట్రీలో తిరగరాని రికార్డులు రాస్తున్న ప్రభాస్ కు పర్సనల్ లైఫ్ విషాదంగా మారింది. ఆయనకు పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నటుడు కృష్ణం రాజు ఇటీవలే మరణించారు. దీంతో ఆయనపై కుటుంబ భారం బాగానే పడింది. మరోవైపు 30 ఏళ్ల వయసు దాటినా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉంటున్నారు.కొందరు హీరోయిన్లతో ఆయన వివాహం చేసుకుంటున్నారని వార్తలు వచ్చినా అవి నిజం కాలేకపోయాయి. మరి ఆయన జీవితంలో ఎవరు వస్తారో చూడాలి.

ప్రభాస్ స్టార్ హీరో మాత్రమే కాకుండా మనసున్న మారాజు కూడా. ప్రభాస్ గత 20 ఏళ్లుగా ఏన్నోసేవా కార్యక్రమాలు చేశారు. వరదలు వచ్చినప్పుడు, కొవిడ్ సమయంలో భారీ విరాళాలు ఇచ్చారు. తన 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా దాదాపు లక్షమంది తమ స్వగ్రామం వారికి అన్నదానం చేసి తను మనసున్న రాజు అని నిరూపించుకున్నాడు. ఇవే కాకుండా అభిమానులకు అండగా ఉంటూ వారి మన్ననలు పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: