సంక్రాంతికి చిరంజీవి బాలకృష్ణల సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవ్వడం వీరిద్దరూ ఇండస్ట్రీలోకి వచ్చిన నాటి నుండి అనేకసార్లు జరిగింది. ఈ పోటీలో కొన్నిసార్లు చిరంజీవి విజయం సాధిస్తే మరికొన్నిసార్లు బాలయ్య విజయం సాధించాడు. అయితే సంక్రాంతి రేస్ కు సంబంధించి విజయాల శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే చిరంజీవికంటే బాలయ్యకు ఎక్కువ సక్సస్ రేట్ ఉంది అంటారు.


చాల సంవత్సరాల తరువాత మళ్ళీ బాలకృష్ణ చిరంజీవి లు నటించిన ‘వీర సింహారెడ్డి’ ‘వాల్టేర్ వీరయ్యలు వచ్చే ఏడాది సంక్రాంతికి ఒకదాని పై ఒకతిఒ పోటీ పడబోతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలను నిర్మించిన నిర్మాతలు మైత్రీ మూవీస్ కావడంతో తమ సంస్థ తీసిని సినిమాలను తామే ఒక దానిపై ఒకటి పోటీగా ఎందుకు విడుదల చేస్తున్నారో తెలియక ఇండస్ట్రీలో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. దీనికితోడు ఈ రెండు సినిమాలు కూడ మాస్ సినిమాల జోనర్ కావడంతో సంక్రాంతికి సగటు ప్రేక్షకుడు రెండు మాస్ సినిమాలు తీస్తాడా అన్న సందేహాలు కొమ్దరకు వస్తున్నాయి.


ఈరెండు సినిమాల కంటే ముందు ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఇదే సంక్రాంతి రేస్ కు వస్తూ ఉండటంతో ధియేటర్లలో ఎక్కువ శాతం ప్రభాస్ సినిమాకే వెళ్ళిపోతాయి అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి బాలకృష్ణ సినిమాలను భారీ రేట్లకు కొనుక్కుంటున్న బయ్యర్లు రెండు భారీ మాస్ సినిమాల మధ్య పోటీ వద్దు అంటూ ఈ రెండు సినిమాలను నిర్మించిన మైత్రీ మూవీస్ నిర్మాతలతో రాయబారాలు చేస్తూ గగ్గోలు పెడుతున్నట్లు టాక్. అయితే అటు బాలకృష్ణ ఇటు చిరంజీవి తమ సినిమాలను ఎట్టి పరిస్థితులలోను సంక్రాంతి రేస్ లో దింపి తీరాలి అన్న ఒత్తిడి మైత్రీ మూవీస్ సంస్థ పై చేస్తున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి తమకు ఎదురౌతుందని ఎప్పుడు ఊహించని మైత్రీ మూవీ సంస్థ బాలయ్య చిరంజీవిల పోటీ ఎలా నివారించాలన్న ఆలోచనలతో సతమతమౌతున్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: