ఇటీవల కాలంలో బుల్లితెరపై ఎంటర్టైర్మెంట్ కి కొదవ లేకుండా పోయింది అని చెప్పాలి. ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ పంచేందుకు ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. అయితే ఎన్నో ఏళ్ల నుంచి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచడమే కాదు అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటున్న షో ఏది అంటే అందరూ చెబుతారు ఢీ షో అని. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం దాదాపు గత పదేళ్ల నుంచి కూడా బుల్లితెరపై సెన్సేషన్ సృష్టించింది అని చెప్పాలి. ఎంతోమంది కొరియోగ్రాఫర్లకు లైఫ్ ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఢీ షోలో కంటెస్టెంట్ గా వచ్చి ఆ తర్వాత డాన్స్ మాస్టర్లుగా మారి ఇక సినిమాలలో రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇకపోతే ఒకప్పుడు కేవలం డాన్స్ లు మాత్రమే ఈ షోలో కనిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం కామెడీ షోలకు మించిన ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా హైపర్ ఆది అటు జడ్జిలు టీం లీడర్లు అనే తేడా లేకుండా అందరిపై సెటైర్లు పేలుస్తూ పంచే కామెడీ అందరికీ తెగ నచేస్తూ ఉంటుంది. ఇకపోతే ఇటీవలే వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించిన ఢీ ప్రోమో కాస్త విడుదల అయింది. ఈ ప్రోమో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది చేసిన హంగామా షో మొత్తానికి కూడా హైలెట్ గా నిలిచేలా కనిపించింది అని చెప్పాలి. ప్రోమోలో భాగంగా శ్వేత అనే కంటెస్టెంట్ పర్ఫామెన్స్ కి పూర్ణ బాగా చేశావు అంటూ జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే దీనిపై స్పందించిన హైపర్ ఆది ఫస్ట్ టైం మీ జడ్జ్మెంట్ నాకు నచ్చలేదు. మీది రాంగ్ జడ్జిమెంట్ అంటూ బాటిల్ విసిరేసి స్టేజ్ పైనుంచి కిందికి వచ్చేసాడు. దీంతో పూర్ణ ఫీల్ అయ్యి నువ్వు అలా బిహేవ్ చేయకూడదు అంటూ చెబుతుంది. అప్పుడు హైపర్ ఆది నాకు యాక్టింగ్ రాదు డాన్స్ రాదు అంటూ చెబుతాడు. దీంతో కాస్త ఘాటుగా రియాక్ట్ అయిన పూర్ణ నీకు సిగ్గు ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళు అంటూ చెబుతుంది. దీంతో ఆది రియాక్ట్ అవుతూ నాకు సిగ్గు లేదు రాదు అంటూ పూర్ణ కి కౌంటర్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: