తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి శింబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శింబు ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. అలాగే మన్మధ మూవీ ని తెలుగు లో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకొని  శింబు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. మన్మధ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును దక్కించుకున్న శింబు ఆ తర్వాత తాను నటించడం అనేక మూవీలను తెలుగులో కూడా విడుదల చేశాడు.  ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న శింబు "మానాడు"  మూవీ తో తిరిగి మంచి విజయాన్ని అందుకొని ఫామ్ లోకి వచ్చాడు.

మానాడు మూవీ కి తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం లో తెరకెక్కిన లైఫ్ ఆఫ్ ముత్తు అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఇలా కొంత కాలం పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయాలు లేని శింబు ప్రస్తుతం వరస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా శింబు దయచేసి మూవీ అప్డేట్ లను అడగకండి అని చెప్పేశాడు. ప్రేక్షకులు పదే పదే సినిమా అప్డేట్ లను అడగడం వల్ల సినిమా తెరకెక్కించడం లో తప్పటడుగు వేసే అవకాశం ఉంది అని ఈ హీరో చెప్పుకొచ్చాడు. తాజాగా శింబు ఇలా ప్రేక్షకులు సినిమా అప్డేట్ లను అడగడం పై ప్రస్తావించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: