ప్రతి సంవత్సరం నవంబర్ 14 న బాలల దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచంలోని దేశాలన్ని కూడా నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకుంటాయి. మన దేశం మాత్రం ఆరు రోజులు ముందుగానే బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటుంది?

ఇందులో ఉండే విశిష్టత ఏంటి? అనే కారణాలు అయితే తెలుసుకోవాలి. నవంబర్ 14 మన మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు కావడం తెలిసిన విషయమే . దీంతో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్ని నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకుంటుంటే మన దేశం మాత్రం జవహర్ లాల్ జయంతినే బాలల దినోత్సవంగా జరుపుకుంటోందట.. నెహ్రూకు బాలలంటే ఎంతో ఇష్టం. దీంతో ఆయన మరణించిన తరువాత ఆయన పుట్టిన రోజునే బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలుస్తుంది..

దేశానికి మొదటి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ చేసిన సేవలు మాత్రం అనితర సాధ్యం. దేశ పురోగమనంలో ఆయన పాత్ర అయితే కీలకం. ఎన్నో పథకాలు చేపట్టి దేశాభివృద్ధిలో ఆయన ఘనత చూపారు. అందుకే ఆయన పుట్టిన రోజును బాలల దినోత్సవంగా అందరూ కూడా చేసుకుంటారు. ఆయన ఎక్కడకు వెళ్లినా బాలలను పలకరించి వారితో ఆప్యాయంగా మాట్లాడేవారు. ఆయనకు గులాబీ పువ్వులంటే ఇష్టం కావడంతో పిల్లలు పూలు ఇచ్చి పలకరించేవారట.దీంతో ఆయన కూడా వారితో మాట్లాడేందుకు ఎంతో ఉత్సాహం చూపేవారు. దీంతో నెహ్రూకు బాలలంటే ఉన్న మక్కువతోనే ఆయన జయంతిని బాలల దినోత్సవంగా భారత ప్రభుత్వం నిర్వహించేందుకు ముందుకొచ్చిందని తెలుస్తుంది.

1964లో నెహ్రూ మరణించిన తరువాత నుంచి ఆయన పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.. ఈ రోజు పిల్లలు స్కూళ్లలో సందడి చేస్తారు. పిల్లలే ఉపాధ్యాయులుగా మారి పిల్లలకు బోధన చేయడం వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. పెద్ద తరగతుల పిల్లలు చిన్న తరగతులకు ఉపాధ్యాయులుగా వచ్చి వారికి పాఠం బోధించడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అన్ని పాఠశాలలు ఈ వేడుకను ఎంతో వైభవంగా నిర్వహిస్తాయి. బాలల దినోత్సవం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతాయి.

ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్ని చిల్డ్రన్స్ డేను నవంబర్ 20న జరుపుకుంటాయట. ఒక్క భారతదేశం మాత్రం దీన్ని ముందుగానే జరుపుకుంటోంది. మనదేశం మన మొదటి ప్రధాని జన్మదినాన్ని బాలల దినోత్సవంగా చేసుకుంది. అందుకే నవంబర్ 14ను బాలల దినోత్సవంగా చేసుకుంది. దీంతోనే ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలతో సంబంధం లేకుండా మనం ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నాం. బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుని ఎంతో ఉత్సాహంగా అయితే ఉంటారు. నవంబర్ 14 పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: