తెలుగు స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'ధమాకా' ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోండగా, ఈ సినిమాను డిసెంబర్ 23 న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. కాగా, ఈ సినిమాలో రవితేజ పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ పదేపదే చెబుతూ వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకుల ను అలరించడం లో సక్సెస్ అయ్యాయి..


ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకుందట. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా భారీ రేటుకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమాకు ఓటీటీ లోనూ అదిరిపోయే రెస్పాన్స్ దక్కడం ఖాయమని ఓటీటీ నిర్వాహకులు భావిస్తున్నారు. సాధారణంగానే రవితేజ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయని, ఆడియెన్స్ ఆయన సినిమాల ను తెగ ఎంజాయ్ చేస్తుంటారు.. హిట్ మాట పక్కన పెడితే సినిమాల ను అన్నీ రకాల ప్రేక్షకులు చూసేలా వుంటాయి..


అలాంటి రవితేజ నటిస్తున్న ధమాకా చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని అందుకుంటే, ఇక ఓటీటీ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని వారు భావిస్తున్నారట. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండ గా, ఈ సినిమా ను పీపుల్ మీడియా ఫ్యాక్టరి మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.. గతంలో వచ్చిన సినిమాలు అన్నీ సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు.. కనీసం ఈ సినిమా అయిన హిట్ అవుతుందేమో చుద్దాము..

మరింత సమాచారం తెలుసుకోండి: