
ఈ క్రమంలోనే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ నుంచి ప్రోమో విడుదల చేయగా అందులో బావగారు బాగున్నారా అని ఎపిసోడ్ నిర్వహించారు. ఇందులో రాజ్ తరుణ్ తో పాటు మోడల్ బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సి కూడా హాజరయ్యారు. అంతేకాదు చాలామంది బుల్లితెర సెలబ్రిటీలు కూడా వచ్చి సందడి చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ మొదటినుంచి చివరి వరకు ఫుల్ ఫన్ అందించబోతోంది అనే విషయం అయితే ప్రస్తుతం స్పష్టం అవుతోంది. అందులో భాగంగానే నెటిజెన్స్ అడుగుతున్నట్టుగా కొన్ని ప్రశ్నలను స్క్రీన్ పై చూపించి వాటికి సమాధానం చెప్పమని అన్నారు.
ఈ క్రమంలోనే రష్మీ కి కొత్త విల్లా కొనిచ్చిన హీరో ఎవరు అనే ప్రశ్న కూడా రష్మీకి ఎదురవ్వగా ప్రోమోలో ఆమె ఆ హీరో ఎవరో చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఆమె చెబుతున్నంత సేపు ప్రోమో మ్యూట్ చేశారు. మరి ఆ హీరో ఎవరో తెలియాలి అంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి ఉండాల్సిందే. కానీ కొంతమంది ఇందులో ఏమాత్రం నిజం లేదని రేటింగ్ కోసమే ఇలా చేస్తున్నారంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు..