తమిళ హీరో విజయ్  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా వారిసు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో ఇప్పుడు దిల్ రాజు అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకున్నారు.ముందు ప్రకటించిన విధంగా కాకుండా ఈ సినిమా ఇప్పుడు ఒక తమిళ సినిమా అని దాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నామని దిల్ రాజు మాట మార్చుతున్నారు. ఈ క్రమంలో తెలుగులో ఇప్పటికే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత  తెలుగు సినిమాలకే ఇవ్వాలని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక లేఖ కూడా విడుదల చేసింది. దిల్ రాజు గతంలో చెప్పినట్లుగానే డబ్బింగ్ సినిమాలకు ద్వితీయ ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక లెటర్ రిలీజ్  చేసింది.ఈ క్రమంలో ఎగ్జిబిటర్లను హెచ్చరించింది. ఈ విషయం మీద తాజాగా తమిళ దర్శకుల సంఘం మీటింగ్ జరగగా దానిమీద లింగస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లింగుస్వామి మీడియాతో మాట్లాడుతూ..


ఈ వారిసు.. తమిళం నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీ అని ఆ సినిమాకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో థియేటర్స్ దొరకకపోతే తెలుగు సినిమా ఎన్నో రకాలుగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అయితే లింగు స్వామి కామెంట్ మీద తెలుగు వాళ్ళు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. తమిళ సినిమాల మార్కెట్లో 20 శాతం తెలుగు షేర్ ఉంటుందని అలాంటి తెలుగువాళ్లను బెదిరించే విధంగా మాట్లాడే స్థాయికి మీరు వెళ్లారా అని తెగ తిడుతున్నారు.తమిళ దర్శకులను తెలుగు వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతుంటే తిరిగి తెలుగు వాళ్లకే వార్నింగ్ ఇచ్చే స్దితికి వచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే తెలుగులో మీరు వారియర్ అనే సినిమా మాత్రమే చేశారు అంతేకానీ మీరేమీ వారియర్ కాదు. కాబట్టి ఇలాంటి పనికిమాలిన డైలాగ్స్ కొట్టి అనవసరంగా తమిళ- తెలుగు ప్రేక్షకుల మధ్య గొడవలు పెట్టొద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: