తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశ్వక్ సేన్ ఇప్పటికే అనేక మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే విశ్వక్ సేన్ ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం మొదట గా విశ్వక్ సేన్ "అశోక వనంలో అర్జున కళ్యాణం" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత ఓరి దేవుడా అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాలను అందుకున్నాయి. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విశ్వక్ సేన్ "దమ్కి" అనే పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో విశ్వక్ సేన్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా దమ్కి మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో దమ్కీ మూవీ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. దమ్కి మూవీ యూనిట్ విడుదల చేసిన  పోస్టర్ లో విశ్వక్ సేన్ స్టైలిష్ లుక్ లో వైట్ కలర్ ప్యాంట్ మరియు పింక్ కలర్ కోట్ ను ధరించి ఉన్నాడు. ప్రస్తుతం దమ్కి చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: