ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన దర్శకత్వం వహించిన తమిళ చిత్రం లవ్ టుడే ఇటీవలే విడుదలైంది అన్న విషయం తెలిసిందే. ఈనెల 25వ తేదీన విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో థియేటర్లలో కొనసాగుతూ ఉంది. గతంలో దర్శకుడిగా తన ప్రతిభ ఏంటో నిరూపించిన ప్రదీప్ రంగనాథన్.. ఇక ఇటీవల నటుడిగా కూడా తనలో ఉన్న టాలెంట్ను బయటపెట్టి ప్రేక్షకులను మెప్పించాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 2009లో దర్శకుడిగా నాకు కోమలి అనే సినిమా లో మొదటి ఛాన్స్ వచ్చింది అంటూ ప్రదీప్ రంగనాథన్ చెప్పుకొచ్చాడు. జయం రవి హీరోగా నటించిన ఈ సినిమాకు మంచి స్పందన రావడం తో దర్శకుడిగా నా మొదటి అడిగే సక్సెస్ ని ఇచ్చింది అంటూ తెలిపాడు. ఇక ఆ తర్వాత మూడేళ్ల పాటు స్క్రిప్ట్ పైన వర్క్ చేసి లవ్ టుడే అనే సినిమాను తీశాము. నేను 2007లో చేసిన షార్ట్ ఫిలింనే లవ్ టు డే సినిమాగా తీసాం. అయితే మొబైల్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు అని చెప్పగలను అంటూ ప్రదీప్ చెప్పుకొచ్చాడు.


 అయితే ఈ సినిమా హిట్ అవుతుందని ఊహించాను. కానీ ఇక తెలుగు ప్రేక్షకుల నుంచి మాత్రం ఈ స్థాయి లో రెస్పాన్స్ వస్తుందని అస్సలు ఊహించ లేదు అంటూ తెలిపాడు. ఇంటర్వెల్ సమయం లోనే దిల్ రాజు గారు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అన్నారు. అంతే కాదు నన్ను స్టార్ హీరో ధనుష్ తో పోలుస్తున్నారు. సన్నగా ఉండడం వల్ల కాబోలు ఆయనతో పోలుస్తున్నారు. ఆయనతో పోల్చడం సంతోషమైనప్పటికీ.. అంత అద్భుతమైన నటుడి తో  నాకు పోలిక పెట్టడం సరి అయింది కాదేమో అని అనిపిస్తుంది అంటూ ప్రదీప్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: