తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , అడవి శేషు సరసన హీరోయిన్ గా నటించగా , వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ మూవీ ని నాచురల్ స్టార్ నాని నిర్మించాడు. డిసెంబర్ 2 వ తేదీన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ మంచి విజయం సాధించడం హిట్ ది సెకండ్ కేస్ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. హిట్ ది సెకండ్ కేస్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 14.25 కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ జరిగింది. ఈ మూవీ 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటివరకు ఈ మూవీ 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 16.21 కోట్ల షేర్ , 28.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దానితో నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని 1.21 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: