రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాక్టర్ గా, డైరెక్టర్ గా, నట శిక్షకుడిగా దేవదాస్ కనకాల గుర్తింపును సొంతం చేసుకున్నారు.యానాం శివారులోని కనకాలపేటలో దేవదాస్ కనకాల జన్మించారు. దేవదాస్ కనకాల ఆంధ్రా యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చదవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్ లో నటుడిగా పని చేశారు.

దేవదాస్ కనకాల, లక్ష్మీదేవిలకు 1971 సంవత్సరం లో మ్యారేజ్ జరగ గా ఈ వివాహం ప్రేమ వివాహం కావడం గమనార్హం. ఆ తర్వాత రోజు ల్లో దేవదాస్ కనకాల నటుడిగా, దర్శకుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు. చలిచీమలు, ఓ ఇంటి భాగోతం సినిమాలకు ఆయన డైరెక్టర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అమృతం సీరియల్ ఆయనకు మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది. భరత్ అనే నేను మూవీ ఆయన నటించిన చివరి మూవీ కావడం గమనార్హం.

అయితే దేవదాస్ కనకాలకు ఇండస్ట్రీ లో ఆశించిన స్థాయి లో గుర్తింపు రాలేదని చాలా మంది భావిస్తారు. ఎంతో టాలెంట్ ఉన్న రాజీవ్ కనకాల తండ్రిని ఇండస్ట్రీలో తొక్కేశారని కొంతమంది అభి ప్రాయం వ్యక్తం చేస్తు న్నారు. ఓ సీత కథ సినిమాలో దేవదాస్ కనకాల అద్భుతం గా చేశారని ఆయనను ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో తొక్కేశారని ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు అభి ప్రాయపడ్డారు.

లక్ ఫ్యాక్టర్ కూడా దేవదాస్ కనకాలకు కలిసి రాలేదని అందుకే ఆయన ఇండస్ట్రీలో ఆశించిన రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకోలేదని చాలామంది భావిస్తున్నారు. దేవదాస్ కనకాల వారసుడు రాజీవ్ కనకాల ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. రాజీవ్ కనకాల ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజీవ్ కనకాలకు భారీగానే రెమ్యునరేషన్ అందుతోందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: