దగ్గుబాటి రామానాయుడు వారసులుగా వెంకటేష్ హీరోగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన సురేష్ బాబు నిర్మాతగా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. రానా దగ్గుపాటి కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చుకోవడం జరిగింది. అయితే రానా హీరో గానే కాకుండా బాహుబలి సినిమాలో విలన్ గా నటించి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపును తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఈయన సినిమాల్లో ఎక్కువగా నటించడం లేదు. ఈ విషయం తెలిసిన చాలా మంది ఈయన అభిమానులు అసలు రానాకి ఏమైంది

 ఎందుకు సినిమాల్లో నటించడం లేదు అని కామెంట్లు చేస్తున్నారు అయితే అసలు విషయంలోకి వెళ్తే రానా నటించిన లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టి ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ మంచి గుర్తింపును అందుకున్నాడు. అలాంటి రానా ఈ మధ్యకాలంలో విరాటపర్వం భీమ్లా నాయక్ అనే సినిమా ద్వారా మరొక సినిమా గురించి అనౌన్స్ చేయడం లేదు. దాని తర్వాత ఏ ప్రాజెక్ట్ కి కూడా ఒప్పుకోలేదు. ఎందుకు రానా ఇలా చేస్తున్నాడు అంటూ ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దగ్గుబాటి హీరోలు మునుపటిలా జోష్ కనిపించడం లేదంటూ చాలామంది చెప్తున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ లో రానా  చంద్రబాబు నాయుడు గా చేయడం జరిగింది దానికంటే ముందు హీరోగా లేదా కీలకమైన పాత్రలో నటించిన రానా ఈమధ్య కేవలం చిన్నచిన్న సినిమాలలో మాత్రమే నటిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన విరాటపర్వం భీమ్లా నాయక్ సినిమాల తరువాత రానా మరో సినిమా చేయలేదు.  ఆ మధ్యకాలంలో రానాకి ఆరోగ్యం బాగాలేదు దానికి సంబంధించి అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు అనే వార్తలు రావడం జరిగింది. అప్పటినుండి రానా గురించి ఏ విషయం కూడా బయటకు రాలేదు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈ హీరో నాయుడు అనే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడు అనే వార్తలు రావడం జరిగింది. అయితే రానా ఆరోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నాడా లేక వేరే ఇతర కారణాల అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి .దీంతో రానా సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: