మలైకా అంటే ఏంజిల్.. కానీ నేను ఏంజిల్ కాదు.. డిజైనర్‌ను మాత్రమే అని చెప్పుకొచ్చింది. అలాగే తన మాజీ భర్త సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భా్జ్ ఖాన్ పై ప్రశంసలు కురిపించింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలని భావించి పెళ్లి చేసుకోవాలనుకున్నానని.. అయితే జీవితంలో భిన్నమైన అంశాలు కోరుకోవడం వల్లే తాము విడిపోయినట్లు తెలిపింది. తమ మాజీ భర్త తనను ఓ వ్యక్తిగా మార్చాడని.. అతని వల్లే నేను ఈరోజు ఇలా ఉండటానికి తనే కారణమని.. నేను కూడా విభిన్నమైన విషయాలను కోరుకున్నానని.. జీవితం ఎక్కడో గాడి తప్పినట్లు నేను భావించాను. నేను మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను నిజంగా కొన్ని బంధాలను వదులుకోగలిగితే అలా చేయగలనని భావించాను అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే.. ఇటీవల తనకు జరిగిన ప్రమాదం గురించి ఓపెన్ అయ్యింది. మలైకా మాట్లాడుతూ… ‘ప్రమాదం సమయంలో నేను నా పిల్లలను చూడలేనని అనుకున్నాను. కానీ కొన్ని గంటల్లో నేను స్పృహలోకి వచ్చాను. ఆపరేషన్ తర్వాత నా కళ్ళు, ముందు ఉన్న వ్యక్తి అర్బాజ్. కాసేపటికి నేను నా గతానికి తిరిగి వెళ్తున్నట్లు అనిపించింది. ఆ సమయంలో అర్బాజ్ నాతో ఉన్న తీరు. అది నా మనసుకి చేరింది’. విడాకులు తీసుకున్న సమయంలో తన కుమారుడు అర్హాన్‌కు చాలా మద్దతు వచ్చిందని తెలిపింది.