టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేస్ ఉన్న యంగ్ హీరో లలో ఒకరు అయినటు వంటి మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పటికే ఈ సంవత్సరం అశోకవనంలో అర్జున కళ్యాణం , ఓరి దేవుడా మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు మూవీ లకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం దక్కింది. ఇది ఇలా ఉంటే విశ్వక్ సేన్ కొన్ని రోజుల క్రితం ఓరి దేవుడా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. అశ్విత్ మరిమత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన మిథాలీ పాల్కర్ హీరోయిన్ గా నటించగా , టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. 

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు ఈ మూవీ ని 10 నిమిషాల పాటు ఫ్రీ గా చూసుకునే వెసులు బాటును కల్పించింది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ "ధమ్కీ" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నివేత పేత్ రాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుండి కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం ఒక పాటను విడుదల చేసింది. దమ్కి మూవీ లో విశ్వక్ సేన్ హీరో గా నటించిన మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: