టాలీవుడ్ డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్ ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేయడం జరిగింది.ఈ నెల 19వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించడం జరిగింది. ఇక రోహిత్ రెడ్డితో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వీరు ఇద్దరూ  కూడా 19వ తేదీనే హాజరు కానున్నారు.టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ గత సంవత్సరం విచారణ జరిపింది. అయితే ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో సైలెంట్ అయింది. అయితే పూర్తిగా ఈ కేసును విత్ డ్రా చేసుకోలేదు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలివ్వలేదని.. ఇక కోర్టుకు వెళ్లి.. ఆధారాల కోసం న్యాయపోరాటంని చేశారు. హైకోర్టు కూడా పదే పదే ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఈడీకి అధారాలని ఇవ్వడం జరిగింది. ఇక ఈడీ అధికారులకు ఇచ్చిన సమాచారంలో..కోర్టుకు సమర్పించని కీలకమైన వాంగ్మూలాలు ఇతర డిజిటల్ ఆధారాలు ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. వీటిని పరిశీలించి టాలీవుడ్ డ్రగ్స్ నిందితులకు ఈడీ ప్రత్యేకంగా నోటీసులు జారీ అవకాశాలు ఉన్నాయని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.ఇక చాలా రోజుల ఆలస్యం తర్వాత ఇప్పుడు నోటీసులు జారీ చేయడం అనేది అనూహ్యంగా మారింది.


ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల్ని ఇప్పటికే ఈడీ అధికారులు ఓ సారి ప్రశ్నించడం జరిగింది. కానీ అప్పుడు వారికి ఇక ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు. అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు కూడా ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. దాదాపుగా క్లీన్ చిట్ ని ఇచ్చారు. అయితే నిజానికి ఈడీ దర్యాప్తు చేసేది డ్రగ్స్ వాడారా లేదా అనేది కాదు. డ్రగ్స్ కోసం చెల్లింపులు ఎలా చేశారన్నదానపైనేనట. అక్రమ నగదు లావాదేవీల కోణంలోనే ఈ దర్యాప్తుని చేస్తున్నారు. అయితే ఇలా డబ్బులు చెల్లించిన విషయం కనుక బయటకు వస్తే.. నిజంగానే వారు డ్రగ్స్ కొన్నట్లుగా అక్కడ తేలిపోతుంది. అదే జరిగితో మరో రకంగా కూడా ఇరుక్కుంటారు. అంటే.. అన్ని విధాలుగా కేసుల్లోకి వారు వెళ్లిపోతారు. ఇక ఈడీ విచారణలో ఎవరైనా పొరపాటున డ్రగ్స్ కోసం డబ్బులు కనుక చెల్లించినట్లుగా బయటపడితే.. ఇక ఇబ్బందులు తప్పనట్లే. ఆ ఒక్క లింక్ నుంచి మొత్తం ఈడీ బయటకు లాగే ఛాన్స్ ఉంది. ఎలా చూసినా కూడా టాలీవుడ్‌ను మళ్లీ డ్రగ్స్ కేసు వెంటపడటం కూడా ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: