మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ వాల్తేరు వీరయ్య లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ శృతి హాసన్ మెగాస్టార్ సరసన జోడి గా నటిస్తూ ఉండగా , టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ మూవీ యూనిట్ బాస్ పార్టీ అనే అదిరిపోయే మాస్ బీట్ ఉన్న సాంగ్ ను విడుదల చేయగా , ఆ సాంగ్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సాంగ్ లో చిరంజీవి తో పాటు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేల కూడా నటించింది. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి శ్రీదేవి ... చిరంజీవి అనే సాంగ్ ను డిసెంబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ శ్రీదేవి ... చిరంజీవి సాంగ్ ను డిసెంబర్ 19 వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారకంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని ఉండగా , శృతి హాసన్ పింక్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన పింక్ కలర్ లో ఉన్న స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి ఉంది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: