నయనతార నటించిన కనెక్ట్ సినిమా ఈరోజు విడుదల అయ్యింది. ఇక ఆ సినిమా ఎలా వుంది, నటినటుల పెర్ఫార్మన్స్ గురించి ఇంకా జనాలకు కనెక్ట్ అవుతుందా లేదా తెలుసుకుందాం.దెయ్యాల నేపథ్యంలో హారర్ కథలు చూడటం మనకు కొత్తేమీ కాదు. ఎన్నో సంవత్సరాలుగా అటువంటి సినిమాలని మనం తెరపై చూస్తున్నాము. అయితే ఈ సినిమాలో కొత్తదనం ఏదైనా ఉందంటే అది కొవిడ్ బ్యాక్ గ్రౌండ్. ఈ సినిమా దర్శకుడు పాత కథకి కొవిడ్ బాక్గ్రౌండ్ ఇంకా లేటెస్ట్ టెక్నాలజీని కలిపి ఏదో కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అది పర్వాలేదు అనిపించినా కూడా మరీ అంతగా సంతృప్తి ఇవ్వలేదు. సినిమాలో స్టార్టింగ్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నా.. ఆ తర్వాత పాత కథే అనే సంగతి అర్థమవుతుంది.


అందువల్ల సినిమాపై ఆసక్తి కూడా తగ్గిపోతుంది. కరోనా లాక్‌డౌన్ కాలాన్ని గుర్తు చేసే సీన్స్ సినిమాకి కీలకం. ఎవరినీ కలిసే వీలు లేకపోవడం, అందరూ సెల్‌ఫోన్లలో మాట్లాడుకోవడానికే పరిమితమైన పరిస్థితుల్ని ఈ కథకి బాగా కనెక్ట్ చేసి మంచి మార్కులే కొట్టేశాడు దర్శకుడు. ఈ సినిమా అంతా కూడా వీడియోకాల్‌లో రన్ అవుతున్నట్లే ఉంటుంది. ఈ సినిమా కథ సాగే లిమిట్ నాలుగు గోడలకే పరిమితమైనా అందులో నుంచే భయాన్ని పుట్టించేందుకు దర్శకుడు ప్రయత్నించారు. అది అక్కడక్కడా సక్సెస్ అయ్యింది కూడా. ఎమోషన్స్ తో ఎక్కువగా తీసిన ఈ కథ అర్ధంతరంగా ముగిసినట్టు అనిపించడం ప్రేక్షకుడికి పరిపూర్ణమైన అనుభూతిని అయితే ఇవ్వదు. ఒకట్రెండు భయపెట్టే సీన్స్ తప్ప కథలో కొత్తదనం లేదు.


నటీనటులు పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే..నయనతార ఇందులో ఓ టీనేజ్ అమ్మాయికి తల్లిగా కనిపించి బాగానే నటించింది. ఆమె తన పాత్రకి బాగానే న్యాయం చేసింది.  హనియా నఫీసా నటన అయితే ప్రధాన ఆకర్షణ. వినయ్ రాయ్  కనిపించేది కొద్దిసేపే అయినా తండ్రిగా ఎమోషనల్ సీన్స్ తో కట్టిపడేశాడు. సత్యరాజ్, అనుపమ్ ఖేర్ వంటి నటులు అయితే ఎప్పటిలాగే అత్యుత్తమ నటన ప్రదర్శించారు. సినిమాకి టెక్నికల్ ఎలిమెంట్స్ ప్రధానబలం. ముఖ్యంగా సౌండ్ డిజైన్, కెమెరా వర్క్ సినిమాకి ప్రాణం పోశాయి. దర్శకుడు అశ్విన్ శరవణన్ ఎంచుకున్న పాయింట్ సినిమాని న్యాచురల్ గా నడిపిన విధానం మెప్పించినప్పటికీ.. కథ, కథనాల్లో అంత బలం లేదు. ఒకసారి అయితే చూడొచ్చు కానీ.. జనాలకు అంతగా ఏమి కనెక్ట్ అవ్వదు.

మరింత సమాచారం తెలుసుకోండి: