హీరోయిన్గా క్రేజీ దక్కించుకోవడం ఒక ఎత్తు అయితే ఆ క్రేజ్ ను నిలబెట్టుకోవడం చాలా కష్టమైన పని అని చెప్పవచ్చు. అలా ఎంతోమంది అనుకోకుండా క్రేజీ వచ్చి నిలబెట్టుకోకుండా ఉన్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు అలాంటివారు ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఒకరు. స్టార్ డం వచ్చిన సరైన హిట్లు లేకపోవడంతో ఈమె కెరియర్ కాస్త డీల పడిపోయింది. మొదట మలయాళం చిత్రం.. ఓరు ఆదార్ లవ్ సినిమాతో ప్రియా వారియర్ ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.
ముఖ్యంగా ఇందులో కన్ను గీతే వీడియో నెట్టింట చాలా వైరల్ గా మారాడంతో మరింత పాపులర్ అయ్యింది. మలయాళం తో పాటు తెలుగు, తమిళ్ ,హిందీ వంటి భాషలలో కూడా వరస సినిమాలను అందుకుంది.ఈ ముద్దుగుమ్మ చేతులో నాలుగు ఐదు సినిమాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రియా వారియర్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్న హీరోయిన్గా సక్సెస్ కాలేకపోతోంది. గత ఏడాది వరుసగా తెలుగులో చెక్, ఇష్క్ తదితర చిత్రాలలో నటించింది కానీ ఏ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఇతర భాషలలో తెరకెక్కుతున్న సినిమాల పైన ఈ ముద్దుగుమ్మ ఆశలు పెట్టుకుంది. మరొకవైపు స్టార్ హీరోయిన్గా వెండితెర పైన అలరించాలంటే అందం అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రతిరోజు  పెంచుకుంటూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా గ్లామర్ షో చేయడంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా షో చేస్తూ ఉంటుంది ప్రియా వారియర్. తాజాగా షేర్ చేసిన ప్రియ వారియర్ ఫోటోలు ప్రతి ఒక్కరిని ఆకర్షించేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రెడిషనల్ లుక్ లో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ ఫోటోలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: