టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సురేఖ వాణి. తెలుగులో ఎన్నో సినిమాలలో ఆర్టిస్ట్ గా నటించింది ఈమె. దాంతోపాటు మోడరన్ మామ్ గా కూడా ఈమె మంచి గుర్తింపును తెచ్చుకుంది గతంలో ఈమె నటించిన సినిమాలు అన్నిటిలో కూడా చాలావరకు సురేఖవాణి కమెడియన్లకు భార్యగా నటించిన పెద్దగా అవకాశాలు రాలేదు. అప్పుడప్పుడు అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉండేది. గతంలో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ  లకి భార్యగా నటించి మెప్పించింది.తనకి పెళ్లి వయసు వచ్చిన కూతురు కూడా ఉంది.

ఇంత పెద్ద కూతురు ఉన్నప్పటికీ ఆమె అందం మాత్రం తరగకుండా ఎప్పటిలాగా అలాగే ఉంది. ముఖ్యంగా ఈమె పబ్బులు మరియు బార్లలో ఎక్కువగా సందడి చేస్తూ సోషల్ మీడియాలో ఎక్కువ సంఖ్యలో ఫాలోయింగ్ ను తెచ్చుకుంది. దానికిగాను దాని కంటే ఎక్కువ విమర్శలను కూడా ఎదుర్కొంది సురేఖ వాణి. ఈమె భర్త చనిపోయినప్పటికీ కూతురితో సింగిల్గానే ఉంది సురేఖ వాణి. అయితే గత కొన్ని రోజులుగా ఈమెకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటి అంటే సురేఖ వాణి రెండవ పెళ్లి చేసుకోబోతుంది అంటూ చాలా వార్తలు రావడం జరిగాయి.

 దానికి సంబంధించి కొన్ని ఇంటర్వ్యూలలో తన కూతురు సుప్రీత తన తల్లికి ఇంకొక పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. దాని అనంతరం కొన్నాళ్ల తర్వాత మరొక ఇంటర్వ్యూలో తన తల్లి కోరుకునేవాడు ఒకరు ఉన్నాడు అని చెప్పుకొచ్చింది ఈమె. ఇప్పుడు సుప్రీత తన తల్లికి రెండవ పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక సీనియర్ ప్రొడ్యూసర్ తో సురేఖ వాణి పెళ్ళికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా ఈ వార్తపై స్పందించిన సురేఖవాణి ఇదంతా అబద్ధమని  చెప్పింది. నేను ఎవరిని పెళ్లి చేసుకోవట్లేదు అంటూ చెప్పుకొచ్చింది. కానీ తన కూతురు మాత్రం సురేఖ వాణి రెండవ పెళ్లి చేసుకోవాలని ఎప్పటినుండో కోరుకుంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: