ప్రస్తుతం అటు టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది పూజ హెగ్డే. తాజాగా ఈమె రన్వీర్ సింగ్ తో కలిసి నటించిన సర్కస్ సినిమా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు పూజ హెగ్డే. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ నేను సర్కస్ చిన్న చేయడానికి ఒకే ఒక్క కారణం ఉంది.. అది ఈ సినిమా దర్శకుడు రోహిత్ శెట్టి.. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలన్నది నా కోరిక.. ఇక ఆ కోరిక ఇంత త్వరగా నెరవేరుతుంది అని ఎప్పటికీ అనుకోలేదు.. 

కేవలం నేను ఆయన కోసమే ఇంత బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమా చేశాను అంటూ చెప్పుకొచ్చింది పూజ హెగ్డే. అంతేకాదు ఆయన ఫోన్ చేసి విషయం చెప్పగానే కొంచెం కూడా ఆలోచించకుండా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను అని చెప్పుకొచ్చింది ఈమె. మొదట ఆయన ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు.. అని దాని అనంతరం రిటన్ కాల్ చేసిన తర్వాత రోహిత్ శెట్టి కాల్ లిఫ్ట్ చేసి విషయం చెప్పడంతో నా ఆనందానికి హద్దులు లేకుండా పోయానని చెప్పుకొచ్చింది పూజ హెగ్డే.ఆయన మాట్లాడిన సమయంలో నేను బిజీగా ఉన్నప్పటికీ రోహిత్ సినిమా కాబట్టి నా డేట్ లను అడ్జస్ట్ చేసుకుని మరి ఆ సినిమాను చేశాను అని చెప్పుకొచ్చింది ఈమె.

అదే క్రమంలో రోహిత్ నన్ను డేట్స్ కావాలి దొరుకుతాయా అని అడిగారు దాంతో నాకు డేట్స్ లేకపోయినా మీకోసం సర్దుకుంటాను అని చెప్పాను అంటూ చెప్పుకొచ్చింది పూజ హెగ్డే.ప్రస్తుతం వరుస డిజాస్టర్ సినిమాలను అందుకుంటుంది ఈమె. 2023 అయినా  కలిసొస్తుందేమో చూడాలి.వరుసగా ఈమె నటించిన బీస్ట్, ఆచార్య సినిమాలతో పాటు తాజాగా విడుదలైన సర్కస్ సినిమా కూడా పెద్దగా హిట్లను అందుకోలేకపోయాయి. టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలను చేస్తోంది ఈమె. ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి కూడా జోడిగా నటిస్తోంది పూజ హెగ్డే.దాంతో పాటు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా ఒక సినిమాలో నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: