టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మాస్ మహా రాజా రవితేజ ఈమధ్య కాలంలో సరైన హిట్ కొట్టడం కోసం చాలా కాలం పట్టింది. ఇటీవలే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన అవి ప్రేక్షకులను మెప్పించలేకపోయి ప్లాప్ గా మిగిలిపోయాయి. ఇక ఈమధ్యనే ధమాకా సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మాస్ రాజా. ఎంటర్టైన్మెంట్ దర్శకుడు త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు రవితేజ. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల చాలా బాగా నటించింది. పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం గత శుక్రవారం నాడు (డిసెంబర్ 23న) విడుదలైంది. విడుదల అయినా అన్ని సెంటర్ ల నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.


ఇక ఈ చిత్రాన్ని 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' 'అభిషేక్ పిక్చర్స్' బ్యానర్ల పై టి జి విశ్వప్రసాద్ ఇంకా అలాగే వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా విడుదలైన పాటలు, టీజర్ ఇంకా ట్రైలర్ వంటివి మంచి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.ఈ చిత్రం మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.  ఇక ఈ సినిమా ఇప్పటిదాకా రాబట్టిన వసూళ్ల విషయానికి వస్తే విడుదలైన ఎనిమిది రోజుల్లోనే ఏకంగా 69 కోట్లు వసూలు చేసింది. కేవలం 8 రోజుల్లో 69 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసి రవి తేజ రాజాది గ్రేట్ తరువాత హైయెస్ట్ వీకెండ్ గ్రోసర్ గా నిలిచింది.ఇక సంక్రాంతి పండుగ వరకు పెద్ద చిత్రాలు లేకపోవడంతో ఈ వీకెండ్ లో వసూళ్లు బాగా పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇంకా అలాగే సంక్రాంతి పండుగ లోగా ఈ సినిమా వందకోట్ల మార్క్ ను ఈజీగా టచ్ చేసే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: