
ఇకపోతే వరుస కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా సుమారుగా 400 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కింది. భారీ విజువల్ వండర్ గా తెరకేక్కిన ఈ చిత్రం ఇప్పటికీ కూడా థియేటర్లలో కొనసాగుతూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 180 పైగా భాషలలో విడుదలైన ఈ చిత్రం ప్రతిభాషలో కూడా భారీ వసూళ్లను రాబడుతూ.. మరింత క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇకపోతే ఇప్పటివరకు ఇండియాలో విడుదలయ్యి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసిన హాలీవుడ్ సినిమాలను మించి ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్స్ రాబడుతుందని చెప్పవచ్చు.
ఇకపోతే ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా ఈ సినిమా గుర్తింపు తెచ్చుకోవాలి అంటే ఇంకా రూ.40 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం సంక్రాంతి వరకు ఎలాగో సినిమాలేవి విడుదల కానందున ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే ఇంకో 40 కోట్ల రూపాయలు రాబడితే ఈ సినిమా ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన హాలీవుడ్ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ లిమిట్ క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయని.. విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.