ప్రస్తుతం ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఒక రేంజిలో సెన్సేషన్ ని రేపుతున్న చిత్రం 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'. పాన్ వరల్డ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక రేంజిలో వసూళ్ల వర్షం కురిపిస్తుంది.జేమ్స్ కామెరూన్ 13 ఏళ్ల క్రితం 2009 వ సంవత్సరంలో వచ్చిన సినిమా “అవతార్” క్రియేట్ చేసిన రికార్డులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. కానీ  ఇపుడు అవతార్ 2 సినిమా క్రాస్ చేసే దిశగా వెళ్తుంది. అయితే అవతార్ 2 ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 14 నుంచే రిలీజ్ అయ్యి ఇప్పటికి 20 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పటిదాకా  నార్త్ అమెరికా సహా ఇండియా ఇంకా చైనా లో  1.4 బిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించింది. ఇక ఇండియాలో వసూళ్ల విషయానికి వస్తే ఈ సినిమా  350 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా మొత్తం 400 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కింది.


మంచి విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికీ కూడా థియేటర్లలో రన్ అవుతుండటం గమనార్హం. ఇక ప్రపంచవ్యాప్తంగా 180 పైగా భాషలలో విడుదలైన ఈ సినిమా ప్రతిభాషలో కూడా భారీ వసూళ్లను రాబడుతూ..  క్రేజ్ తెచ్చుకోని దూసుకుపోతుంది. ఇక ఇప్పటిదాకా ఇండియాలో విడుదలయ్యి రికార్డు లెవెల్ లో వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ సినిమాలను మించి ఈ సినిమా ఇప్పుడు భారీగా కలెక్షన్స్ రాబడుతుంది.తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా ఒక రేంజ్ లో వసూళ్లు సాధిస్తూ చాలా స్పీడ్ గా దూసుకుపోతుంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తెలుగు సినిమాలకు పోటీగా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.ఇక అవతార్ 1 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 30 వేల కోట్ల దాకా వసూళ్లు సాధించి హైయెస్ట్ గ్రోసర్ గా నిలిచింది. ఇక అవతార్ 2 సినిమా ఆ వసూళ్ళని దాటుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: