ప్రస్తుతం స్టార్ హీరోల పాత బ్లాక్ బాస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేయడం అనేది కేవలం కమర్షియల్ వ్యాపారమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా వరకు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించినా.. కలెక్షన్ల పరంగా వెనుకబడుతున్నాయని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే బ్లాక్ బస్టర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తూ కమర్షియల్ గా క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు చేస్తున్న ప్లాన్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే చాలామంది స్టార్ హీరోల సినిమాలను రిలీజ్ చేస్తూ కమర్షియల్ గా డబ్బు వెనకేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.


ఇప్పుడు ఒక సినిమా తెరకెక్కించి.. విడుదల చేసిన తర్వాత ఆ సినిమాకు కలెక్షన్స్ వస్తాయో లేదో అనే అనుమానం వ్యక్తం అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేస్తే లాభం తప్ప నష్టం ఉండదు. పైగా ఎటువంటి పెట్టుబడి ఖర్చు కూడా ఉండదు అని ఆలోచించిన నిర్మాతలు ఇలా రీ రిలీజ్ చేసే పనిలో పడ్డారు అనే విమర్శలు కూడా ఎదురవుతున్నాయి.  ఒకరకంగా చూసుకుంటే ఎవరైనా సరే కమర్షియల్ గా హిట్ సాధించాలని కోరుకుంటారు. కాబట్టి నిర్మాతలు కూడా ఇలా స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేస్తూ కవర్షియల్ గా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.


ఈ క్రమంలోనే మహేష్ బాబు పోకిరి సినిమాతో ఈ ట్రెండ్  మొదలవగా పవన్ కళ్యాణ్ జల్సా సినిమాను రీ రిలీజ్ చేశారు. అలాగే చిరంజీవి,  బాలకృష్ణ లకు సంబంధించిన సినిమాలను కూడా రీ రిలీజ్ చేయగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలను నెలకు ఒక సినిమా చొప్పున రిలీస్ చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు జల్సా,  ఖుషి సినిమాలను రీ రిలీజ్ చేయగా ఇప్పుడు బద్రి అలాగే తొలిప్రేమ సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి తొలిప్రేమ సినిమా కూడా ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ కాబోతోంది. మొత్తానికి అయితే ఈ సినిమాలు నిర్మాతలకు రెండవసారి లాభాన్ని అందిస్తున్నాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: