అల్లు అరవింద్ ప్రముఖ నిర్మాత మాత్రమే కాదు ప్రముఖ వ్యాపార వేత్త కూడ అతడి వయసు 75 సంవత్సరాలు అయినప్పటికీ ఎక్కడా వ్రుదాప్య సమస్యలు లేకుండా ఇప్పటికి కూడ ఆహా ఓటీటి బిజినెస్ వ్యవహారాలతో పాటు తన సొంత నిర్మాణ సంస్థ నిర్మించే సినిమాల విషయమై నేటితరం యంగ్ రైటర్స్ దర్శకులతో చాల సన్నిహితంగా ఉంటూ వారందర్నీ ఉత్సాహ పరుస్తూ ఆయన అనుసరిస్తున్న బిజినెస్ వ్యూహాలకు ఇండస్ట్రీ వర్గాలు కూడ షాక్ అవుతున్నాయి.

 

 ఇలాంటి పరిస్థితుల మధ్య అల్లు అరవింద్ యంగ్ హీరోయిన్ అనుపమా పరమేస్వరన్ కు కెరియర్ టర్నింగ్ పాయింట్ ఇవ్వబోతున్నాడా అన్న అంచనాలు ఉన్నాయి. గత సంవత్సరం అనుపమ కు మంచి టర్నింగ్ పాయింట్ సంవత్సరంగా మిగిలిపోతుంది. ‘కార్తికేయ 2’ 100 కోట్ల సినిమాగా రికార్డులు క్రియేట్ చేస్తే క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ విడుదలైన ’18 పేజస్’ సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి ప్రశంసలు లభించడంతో పాటు లేటెస్ట్ గా ఓటీటి లో విడుదలైన ఆమె నటించిన ‘బటర్ ఫ్లై’ మూవీకి కూడ మంచి రివ్యూలు రావడంతో ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఏర్పడింది.

 

 
అయితే ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం అనుపమ తన దగ్గరకు వచ్చే దర్శక నిర్మాతలకు కొన్ని కండిషన్స్ పెడుతున్నట్లు టాక్. మితిమీరిన ఎక్స్ పోజింగ్ తాను చేయనని ఆ పాత్రకు అవసరమైనంత స్థాయిలో మాత్రమే తాను గ్లామర్ గా కనిపిస్తానని ఆమె చెపుతున్న కండిషన్స్ తో ఆమె దగ్గరకు వస్తున్న దర్శక నిర్మాతలు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్.

 

 
అంతేకాదు ఈమె మరొక సాయి పల్లవిగా మారుతుందా అంటూ ఇండస్ట్రీలో మరికొందరు కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. ఈ పరిస్థితుల మధ్య అల్లు అరవింద్ అనుపమ నటన మెచ్చి ఆమెకు మూడు సినిమాల కాంట్రాక్ట్ ను ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆమెకు చరణ్ పక్కన కానీ లేదంటే అల్లు అర్జున్ పక్కన కానీ ఎదో ఒక భారీ సినిమాలో అరవింద్ ఆమెకు అవకాశం ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం కూడా మొదలైంది. ఈవార్తలే నిజం అయితే ఆమె కెరియర్ దశ తిరిగినట్లే..  


మరింత సమాచారం తెలుసుకోండి: