తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన వారిసు అనే తమిళ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ఈ మూవీ లోని రంజితమే సాంగ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తమిళ వర్షన్ ను జనవరి 11 వ తేదీన విడుదల చేయనుండగా ... తెలుగు వర్షన్ ను జనవరి 14.వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

మూవీ కి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం. ఈ సినిమాకు తమిళనాడు లో 72 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది  కర్ణాటక లో 7.20 కోట్లు ,  కేరళ లో 6.50 కోట్లు ,  రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.20 కోట్లు ,  ఓవర్సీస్ లో 35 కోట్లు మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కి 137.90 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కనుక 139 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్లయితే ఈ మూవీ క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: