
న్యూఢిల్లీకి చెందిన ఈమె తెలుగులో చాలా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. నిజానికి 2013లో విడుదలైన హిందీ చిత్రం మద్రాస్ కెఫెలో భారత ఇంటెలిజెన్స్ అధికారి విక్రమ్ సింగ్ భార్య రూబీ సింగ్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తర్వాత ఎన్నో సినిమాలలో నటించింది. కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోతోంది .ఇప్పటికే తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ గత ఏడాది పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలలో నటించినప్పటికీ ఈ రెండు ఈమెకు పెద్దగా గుర్తింపును అందివ్వలేదు.
కానీ తాజాగా గత ఏడాది తిరు, తమిళ్ సర్దార్ సినిమాలలో నటించి మంచి విజయం సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈమె చేసిన పనికి అభిమానులు కొంచెం షాక్ అవుతూనే.. మరి కొంచెం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే రాశిఖన్నా ఇకపై ట్విట్టర్ నుండి తన అకౌంటుని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఎప్పటికీ తాను ట్విట్టర్ కి తిరిగి రాను అని ఇన్ స్టాగ్రామ్ లో మాత్రమే అందుబాటులో ఉంటానని ధ్రువీకరించింది. ఇకపోతే ట్విట్టర్లో తాను కనిపించదు అని తెలిసి అభిమానులు కొంచెం నిరాశ వ్యక్తం చేసినప్పటికీ ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటానని చెప్పి వారిలో సంతోషాన్ని నింపింది. మొత్తానికైతే ట్విట్టర్లో ఇక రాశిఖన్నా కనిపించదు అని చెప్పవచ్చు.