కరోనా వేవ్ లు మొదలయ్యాక బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ హిట్ అన్నపదాన్ని విని రెండు సంవత్సరాలు దాటిపోయింది. దీనికితోడు బాలీవుడ్ ప్రేక్షకులు దక్షిణాది సినిమాలను విపరీతంగా ఆదరిస్తూ ఉండటంతో పాటు దక్షిణాది హీరోలకు బాలీవుడ్ టాప్ హీరోలతో సమానమైన క్రేజ్ ఏర్పడటంతో బాలీవుడ్ పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు తెగ మధన పడ్డాయి.


దీనికితోడు బాలీవుడ్ టాప్ హీరోలు షారూఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ లతో పాటు మినిమం గ్యారెంటీ హీరో అని పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ సినిమాలు కూడ ఫ్లాప్ అవుతూ ఉండటంతో బాలీవుడ్ టాప్ హీరోల పరిస్థితి పై అయోమయం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులలో బాలీవుడ్ బాద్ షా గా ఒక వెలుగు వెలిగి గత నాలుగు సంవత్సరాలుగా హిట్ అన్నపదానికి దూరం అయిన షారూఖ్ ఖాన్ మూవీ ‘పఠాన్’ కు దేశవ్యాప్తంగా ఏర్పడిన క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.


ఈమూవీ అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లు బుక్ మై షోలో ఓపెన్ అయిన కొన్ని గంటలలోనే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలలోను హాట్ కేక్స్ లా అమ్ముడైపోవడం చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో కూడ ఈమూవీ టిక్కెట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. రిపబ్లిక్ డేని టార్గెట్ చేస్తూ విడుదల అవుతున్న ఈమూవీకి ఏర్పడిన మ్యానియా రీత్యా మొదటిరోజు ఈమూవీకి దేశవ్యాప్తంగా 50 కోట్ల కలక్షన్స్ వస్తాయని అంచనాలు వస్తున్నాయి.


అంతేకాదు ఈమూవీ మొదటి నాలుగు రోజులలోని 200 కోట్ల కలక్షన్స్ మార్క్ ను చేరుకోవడం ఖాయం అంటున్నారు. వాస్తవానికి ‘పఠాన్’ ఒక పూర్తి మాస్ మసాలా కథ. ఇలాంటి కథలతో బాలీవుడ్ లో అనేక సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈసినిమాకు ఏర్పడిన మ్యానియాను పరిశీలిస్తే మన తెలుగు ప్రేక్షకులు లానే బాలీవుడ్ ప్రేక్షకులు కూడ యూటర్న్ తీసుకుని మాస్ మసాలా సినిమాలను ఆదరించే అలవాటును మళ్ళీ మొదలుపెడుతున్నారా అన్న అంచనాలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: