ఫస్ట్ మూవీతోనే డీసెంట్ హిట్ అందుకున్న యంగ్ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఇప్పుడు పెళ్లి చేసుకోని ఓ ఇంటివారయ్యారు. పూజా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోని ఆమెతో కలిసి ఆయన ఏడడగులు వేశారు.వీరి పెళ్ళికి టాలీవుడ్ హీరో నితిన్..ఇంకా హీరోయిన్ కీర్తి సురేష్… అలాగే డైరెక్టర్ వెంకీ కుడుముల .. ఇంకా ప్రొడ్యూసర్ స్వప్న దత్.. అలాగే ఇతర సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ కొత్త వధూవరులను ఆశీర్వదించారు. కొత్త జంటతో తీసుకున్న ఫోటోలను  నితిన్ ఇంకా కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే ఆ ఫోటోలలో అందరి దృష్టిని బాగా ఆకర్షించింది మాత్రం కీర్తి సురేష్. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్. వెంకీ అట్లూరి పెళ్లికి కీర్తి రంగు రంగుల లెహంగాను ధరించి మరీ వచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె ఫ్యాషన్ సెన్స్ ను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆమె తన దుస్తులను షామియానా ఇంకా కర్టెన్ క్లాత్‏తో రెడీ చేయించుకుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


కీర్తి ఫోటో షేర్ చేస్తూ నీ దుస్తులను షామియానాతో కుట్టిస్తే ఇలాగే ఉంటుంది. అంటూ నెట్టింట కీర్తిని తెగ ట్రోల్ చేస్తున్నారు. కీర్తి సురేష్ లాస్ట్ టైం మలయాళ సినిమా వాషిలో కనిపించింది. ఇక తెలుగులో ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట చిత్రంలో నటించి మంచి కంబ్యాక్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె న్యాచురల్ స్టార్ నాని సరసన దసరా సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె చిరు చెల్లిగా కనిపించనుంది.ఇక ఇదిలా ఉంటే  కొద్ది రోజులుగా కీర్తి సురేష్ అప్డేట్స్ కంటే ఆమె వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. తన స్నేహితుడితో కీర్తి సురేష్ పీకల్లోతు ప్రేమలో ఉందని.. నాలుగేళ్ల తర్వాత వీరు పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వైరల్ అయ్యింది. తాజాగా వీటిపై స్పందించిన కీర్తి సురేష్ తల్లి మేనక.. తన కూతురి గురించి వస్తున్న వార్తలు అబద్ధాలు అని కొట్టిపారేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: