టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అయిన సమంత ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. అలాగే ఈమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా ఈమె ఎంతో మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. ఈ వెబ్ సిరీస్ ఎంత బాగా పాపులర్ అయిందో అందరికి తెలుసు. ఈ సిరీస్ అద్భుత ఆదరణ సంపాదించుకోవడంతో రాజ్ అండ్ డీకే సమంతతో మరో వెబ్ సిరీస్ ప్లాన్ చేశారట.. వరుణ్ ధావన్ సమంతలు కలిసి సిటాడెల్ అనే స్పై వెబ్ సిరీస్ను చేస్తున్నారని తెలుస్తుంది.. దీన్ని రూసో సోదరులు నిర్మిస్తున్నారు..

ఈ వెబ్ సిరీస్ కోసం గత కొద్దిరోజులుగా సమంత డేట్స్ సర్దుబాటు చేస్తూనే వచ్చారని సమాచారం . అయితే ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సిరీస్ సమంత మయోసైటీస్ కారణంగా షూటింగ్ ప్రారంభం కాలేదని తెలుస్తుంది.అయితే సమంత ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి పూర్తిగ కోలుకోవడంతో ఈమె తిరిగి షూటింగ్లలో పాల్గొనడానికి కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే రూసో సోదరులు సమంతకు వెల్కమ్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా చేశారు. ఈ క్రమంలోనే ఈ పోస్టు పై నటుడు మరియు దర్శకుడు రాహుల్ రవీందర్ కూడా స్పందించారు. ఈ పోస్ట్ పై రాహుల్ రవీందర్ స్పందిస్తూ సమంత క్రేజ్ ఏంటో చూశారా ఏకంగా రూసో సోదరులు ఆమెకు వెల్కమ్ చెప్పారు.సమంత మనల్ని తలెత్తుకునేలా చేస్తోంది అంటూ పోస్ట్ కూడా చేశాడు. ఈ పోస్ట్ పై సమంత స్పందిస్తూ.. నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం అంటూ రాహుల్ పోస్ట్ కు రిప్లై కూడా ఇచ్చారు. ఇలా సమంత గురించి రాహుల్ రవీందర్ చేసిన పోస్ట్ పై చిన్మయి స్పందిస్తూ... సమంత నిజంగా రాణి అంటూ చెప్పుకొచ్చారట.. దీంతో సమంత చిన్మయి పోస్ట్ కి స్పందిస్తూ నువ్వే రాణివి అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: