టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు దర్శకుడు కృష్ణవంశీ. కృష్ణవంశీ ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించాడు. ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించి టాలెంటెడ్ డైరెక్టర్గా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. సింధూరం మురారి ఖడ్గం ఇలా చాలా సినిమాలు ఆయన దర్శకత్వంలో వచ్చి మంచి గుర్తింపును అందుకున్నాయి. అయితే ఈమధ్య కాలంలో ఆయన దర్శకత్వంలో సినిమాలు తగ్గాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో గోవిందుడు అందరివాడేలే సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్నాడు కృష్ణవంశీ.

తాజాగా ఇప్పుడు మరోసారి రంగమార్తాండ అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చదివేగంగా జరుగుతుంది. కృష్ణవంశీ ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే త్వరగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కృష్ణవంశీ. ఇక ఈ సందర్భంగా ఆయన చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు కృష్ణవంశీ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పై కృష్ణవంశీ చేసిన కామెంట్లు కాస్త వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో భాగంగా కృష్ణవంశీ మాట్లాడుతూ.. చిరంజీవిని అన్నయ్య అని ఆప్యాయంగా పిలుస్తాను అని..

చిరంజీవి గారితో నాకు చాలా మంచి అనుబంధం ఉందని.. దానితోపాటు మంచి చెడు కూడా ఉంది అని.. రంగమార్తాండ సినిమాకి వాయిస్ ఓవర్ చెబుతారా అని.. చిరంజీవి గారిని ముందుగా అడగడానికి చాలా భయపడ్డాను అని.. అనంతరం చెప్పినా తర్వాత ఎందుకయ్యా భయమని ఆయన నాకు చెప్పడంతో ఒక్కసారి షాక్ అయ్యాను అని.. అంత పెద్ద హీరో దగ్గరికి వెళ్లి వెంటనే అడగలేము కదా అని.. చిరంజీవి గారు ఒక శిఖరం అని ఆయన ముందు పిచ్చిపిచ్చిగా మాట్లాడకూడదని మన లిమిట్స్ లో మనం ఉండాలి అని చెప్పుకొచ్చారు కృష్ణవంశీ. అంతే కాదు చిరంజీవి గారితో అప్పట్లో ఒక సినిమా చేయాలని కూడా నేను అనుకున్నానని ..ఆయన కూడా సినిమా చేయడానికి ఓకే అన్నారని.. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయడం కుదరలేదు అని.. చిరంజీవి గారితో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదని... ఒక మంచి కథ దొరికినప్పుడు తప్పకుండా చిరంజీవి గారితో సినిమా చేస్తాను అంటే చెప్పుకొచ్చాడు కృష్ణవంశీ..!!.

మరింత సమాచారం తెలుసుకోండి: