టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ కొరియోగ్రాఫర్ గా దూసుకుపోతున్నాడు శేఖర్ మాస్టర్. అటు బుల్లితెరలను షోలకు జడ్జిగా అదరగొడుతున్నాడు. అలాంటి శేఖర్ మాస్టర్ ఇప్పుడు మెగా ఫోన్ పట్టి ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మన ఇండస్ట్రీలో చాలామంది కొరియోగ్రాఫర్లు ఫిలిం మేకర్స్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో శేఖర్ మాస్టర్ కూడా చేరిపోయాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో లారెన్స్, ప్రభుదేవా, అమ్మ రాజశేఖర్, సన్నీ ఇలా చాలామంది కొరియోగ్రాఫర్లు మెగా ఫోన్ పెట్టారు. వీరిలో ప్రభుదేవా కెరీర్ బిగినింగ్ లో మంచి సక్సెస్ లను అందుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడిగా అతని గ్రాఫ్ పడిపోయింది. 

ఆయన తర్వాత లారెన్స్ మాస్టర్ ఎక్కువగా హారర్ సినిమాలు డైరెక్ట్ చేస్తూ విజయాలు అందుకుంటున్నారు. అటు అమ్మ రాశేఖర్ కూడా ఈమధ్య అడపా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మన శేఖర్ మాస్టర్ కూడా డైరెక్షన్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం శేఖర్ మాస్టర్ ఇప్పటికే ఒక కథను స్వయంగా రెడీ చేసి.. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. సినిమా ఫస్ట్ కాపీ బయటకు వచ్చేంతవరకు తాను డైరెక్టర్గా పరిచయం అవుతున్న విషయాన్ని రహస్యంగానే ఉంచాలనుకున్నాడట. అందుకే ఈ విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు.

శేఖర్ మాస్టర్ చాలామంది కొరియోగ్రాఫర్స్ వద్ద పనిచేసినప్పటికీ.. ఆయనకు ప్రభుదేవా మాస్టర్ ఆరాధ్య దైవంగా పేర్కొంటాడు. అలాంటిది ప్రభుదేవా డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటే.. ఇప్పుడు శేఖర్ మాస్టర్ మాత్రం చాలా సైలెంట్ గా ఎవరికి తెలియకుండా ఓ సినిమాని డైరెక్ట్ చేసేస్తున్నాడు. మరి కొరియోగ్రాఫర్ గా భారీ సక్సెస్ అందుకున్న శేఖర్ మాస్టర్ ఓ మంచి డైరెక్టర్గా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. అన్నట్టు ఈ మధ్య శేఖర్ మాస్టర్ ప్రొడ్యూసర్ గా కూడా మారిన విషయం తెలిసింది కదా. కొన్ని వెబ్ సిరీస్ లు, సాంగ్ ఆల్బమ్స్ కి స్వయంగా శేఖర్ మాస్టర్ నిర్మాతగా వ్యవహరించి న్యూ టాలెంట్ ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇక శేఖర్ మాస్టర్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఏంటి? ఆ సినిమాలో హీరో ఎవరు? అనే వివరాలన్నీ త్వరలోనే బయటికి రానున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: