సినిమా ఇండస్ట్రీ లో చిన్న చిన్న గొడవలు ఒకరి మధ్య ఒకరికి సహజంగానే ఉంటాయి. వాటికీ కారణం ప్రత్యేకం గా ఏమి ఉండదు. అందులో భాగంగానే లేడీ సూపర్‌స్టార్‌ నయనతార, యువ హీరోయిన్ ఐనా మాళవికా మోహనన్‌ మధ్య గత కొన్ని నెలలుగా కోల్డ్ వార్‌ నడుస్తున్నది. ఐతే నయనతారను టార్గెట్ గా  చేసుకొని పరోక్షంగా విమర్శలు చేస్తున్నది మాళవికా మోహనన్‌.

ఐతే ఈ గొడవలకి కారణం 'కనెక్ట్‌’ చిత్రం లో నయనతార హాస్పిటల్ సీన్స్ లో కూడా హెవీ మేకప్‌తో కనిపించిందని, ఆ సీన్‌ చాలా ఆర్టిఫిషల్ గా  అనిపించిందని కొద్ది రోజుల క్రితం మాళవిక వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఐతే ఆమె మాటలపై తీవ్రంగా ప్రతిస్పందించింది నయనతార. ఈ 'కనెక్ట్‌’ మూవీ అనేది పక్కా కమర్షియల్‌ మూవీ కాబట్టి డైరెక్టర్ సూచనల మేరకే చేసానని ప్రతి చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో చూడొద్దని వార్నింగ్ ఇచ్చింది.

ఐతే ఈ ఇష్యూ  సమసి పోకముందే ఇంకోసారి వివాదాస్పద కామెంట్స్‌ చేసింది మాళవికా మోహనన్‌. ఐతే తన లేటెస్ట్ మూవీ  'క్రిస్టి' ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన పరిప్రూచ్చా లో  తనకు లేడీ సూపర్‌స్టార్‌ అనే పిలుపు నచ్చదని, కథానాయికల్ని కూడా సూపర్‌స్టార్స్‌ అని పిలిస్తే బాగుంటుందని చెప్పింది. ఈ వ్యాఖ్యలపై నయనతార ఫ్యాన్స్ సోషల్ ‌మీడియా వేదికగా మండిపడ్డారు. ఐతే అవి నయనను టార్గెట్ చేసి అన్నవేనని ఐతే డానికి మాళవిక వెంటనే సారీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఐతే వివాదం తీవ్రమమ్యే సూచనలు కనిపించడం తో మాళవిక వివరణ ఇచ్చింది. తనకు నయనతార అంటే చాలా గౌరవమని, ఆమెను నేను నటనాపరంగా స్ఫూర్తిగా తీసుకుంటానని తెలిపింది. ఐతే స్టార్ హీరోయిన్స్ అందరిని  ఉద్దేశించి తాను ఆ మాటలు అన్నానని, ఐతే ఇక ఈ గొడవకి ఎండింగ్ ఇవ్వాలని ఆమె కోరుకుంటున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: