తెచ్చుకున్న రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకి ఇంత వయసు వచ్చినప్పటికీ ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం రజనీకాంత్ స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాపులు అందుకున్నప్పటికీ సరే ఆయన ఇమేజ్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు.సినిమాల విషయంలో ఆయన కాస్త ఇబ్బంది పడుతున్నప్పటికీ మళ్లీ వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఆయన అభిమానుల కోసం ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న దాన్నిబట్టి చూస్తే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది.

ప్రస్తుతం రజనీకాంత్ మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.ఇక ఈ రెండు సినిమాలలో జైలర్ సినిమా కూడా ఒకటి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ విడుదలై సినిమాపై ఎంతటి అంచనాలను పెంచాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ ఎన్నడు లేనివిధంగా కనిపిస్తాడని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా కోసం ఆయన పూర్తి సమయాన్ని కూడా కేటాయిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర బాష రేంజ్ లో ఉంటుందని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇదిలా ఉంటే ఇక జైలర్ కోసం రజనీకాంత్ ఏకంగా 140 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.

సినిమా తర్వాత అయినా లాల్ సలాం అనే సినిమా చేయనున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ ఒక గెస్ట్ రోల్ లో మాత్రమే చేస్తున్నాడు. అయితే ఇందుకోసం ఆయన ఏడు రోజుల డేట్స్ను అడిగారట చిత్రం బృందం. ఇక ఆ ఏడు రోజుల కోసం రజనీకాంత్ ఏకంగా 25 కోట్లు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది .దీన్ని బట్టి చూస్తే ఈ వయసులో కూడా ఆయన క్రేజ్ ఏ విధంగా ఉందో చెప్పొచ్చు. ఏడు రోజులకు 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే రోజుకు దాదాపు 3.5 కోట్లు అన్నమాట. ఆయన సీనియారిటీ పాపులారిటీ మరియు క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: