నందమూరి కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చిన నటనలో నందమూరి తారకరత్న కూడా ఒకరు. మొదట్లో ఎంతో క్యూట్ గా లవర్ బాయ్ గా కనిపించి తారకరత్న ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో విలన్ గా కూడా నటించారు. దాదాపుగా 20 ఏళ్ల క్రితం తెలుగు తెరకు పరిచయమయ్యారు తారకరత్న అప్పట్లోనే పెను సంచలనాన్ని సృష్టించడం జరిగింది ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. నందమూరి కుటుంబంలో థర్డ్ జనరేషన్ లో ఎంట్రీ ఇచ్చిన వారసుడిగా పేరు పొందారు. కానీ ఎన్టీఆర్ మనవడు అనే ట్యాగ్ ఉన్నప్పటికీ ఆ పేరుని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు తారకరత్న.


తారకరత్న తండ్రి నందమూరి మోహన్ కృష్ణ ఎన్నో చిత్రాలకు డైరెక్టర్ ఫోటోగ్రఫీ గా పని చేశారు. అంతకుమించి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏది లేకపోయినప్పటికీ సినిమాలే ప్రాణంగా పెరిగారు తారకరత్న. 2002లో ఒకేసారి 9 సినిమాలతో లాంచ్ అయ్యారు తారకరత్న అది కూడా ఒకేరోజు ఒకే ముహూర్తంలో ఎన్ని సినిమాలతో ఎంట్రీ ఇచ్చి ప్రపంచంలోని పేరుపొందిన ఏకైక హీరోగా పేరు పొందారు తారకరత్న. ఈ క్రెడిట్ ఇంతవరకు ఏ హీరో కూడా దక్కించుకోలేదని చెప్పవచ్చు.


అయితే మొదలుపెట్టిన 9 సినిమాలలో కేవలం ఐదు సినిమాలే విడుదలయ్యాయి. ఒకటో నెంబర్ కుర్రోడు యువరత్న సినిమాలలో నటనపరంగా బాగానే ఆకట్టుకున్నాయి.భద్రాద్రి రాముడు సినిమా వరకు తారకరత్న క్రాఫ్ బాగా పెరిగింది కానీ ఆ తర్వాత డౌన్ అవుతూ ఉండడంతో హీరోగా తనకున్న క్రేజ్ తగ్గిపోవడం జరిగిందట. అయినప్పటికీ సినిమా మీద ఉన్న ఫ్యాషన్ తో పలు సినిమాలలో నటిస్తూ ఉన్న పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఆ తర్వాత తారకరత్న తొలి సినిమాలలో విలన్ గా కూడా నటించారు. నెగిటివ్ షేడ్స్ లో నటించి నంది అవార్డును కూడా అందుకున్నారు. నటుడుగా సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నంలో సక్సెస్ అయిన తారకరత్న స్టార్ హీరోగా ఎదగలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: