మెగా పవర్ స్టార్ రాంచరణ్ ను చిరుత సినిమా తర్వాత.. ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా మార్చిన చిత్రం మగధీర. రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే మెగాస్టార్ కొడుకుగానే సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈయన రెండవ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్టు కొడతారని ఎవరు ఊహించలేదు. అందరి అంచనాలను తిరగరాస్తూ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. ముఖ్యంగా ఆ సినిమాలోని డైలాగులు పాటలు అంటే ఇప్పటికీ కూడా చాలామందికి ఇష్టమే. ఇదిలా ఉండగా రాజమౌళి రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా 2009 జూలై 31వ తేదీన భారీ స్థాయిలో విడుదలై అంతకుమించి కలెక్షన్స్ వసూలు చేసింది.

ఇకపోతే ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల హవా జరుగుతున్న నేపథ్యంలో 13 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు మేకర్స్. మరొకసారి కాలభైరవ - మిత్రవిందల  ప్రేమ కథ థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మిత్రవిందా పాత్రలో చాలా అద్భుతంగా ఒదిగిపోయి మరీ నటించింది. అల్లు అరవింద్ నిర్మాణంలో దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో నటుడు శ్రీహరి కీలకపాత్ర పోషించారు.  ఇకపోతే ఈ సినిమాకు కథను డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన విషయం అందరికీ తెలిసిందే.

ఇకపోతే దాదాపు 13 ఏళ్ల క్రిందటి ఈ సినిమా రూ. 45.42 కోట్ల థియేటర్లు బిజినెస్ చేయగా.. మొత్తంగా రూ.77.96 కోట్ల షేర్ వసూలు రాబట్టి రికార్డు సృష్టించింది.  ముఖ్యంగా బయ్యర్లకు రూ.37.54 కోట్ల భారీ లాభాలను అందివ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లలో విడుదల చేయబోతుండడంతో ప్రతి ఒక్కరు ఇప్పుడు మరెంత రాబడుతుంది అనే విషయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: