రెబల్ స్టార్ ప్రభాస్ కొంత కాలం క్రితమే రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందినటు వంటి రాధే శ్యామ్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన రాధే శ్యామ్ మూవీ తో ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచిన ప్రభాస్ ప్రస్తుతం అనేక మూవీ లలో నటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రభాస్ ఇప్పటికే ఆది పురుష్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకోగా ... ప్రస్తుతం సలార్ ... ప్రాజెక్ట్ కే మరియు మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ ... మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యే చాలా కాలం అవుతుంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్ లు కనిపించబోతున్నారు. ప్రభాస్ సరసన ఈ మూవీ లో మాళవిక మోహన్ ... నీది అగర్వాల్ ... రిద్ధి కుమార్ లు హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. అలాగే ఈ మూవీ లో ప్రభాస్ కు తాత పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో ప్రభాస్ తాత పాత్రలో బాలీవుడ్ క్రేజీ నటుడు సంజయ్ దత్ కనిపించబోతున్నట్లు ... ఈ పాత్ర ఈ మూవీ కే హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ను పెట్టే ఉద్దేశంలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఈ మూవీ షూటింగ్ కూడా చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేయడానికి చిత్ర బృందం డిసైడ్ అయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: