ఒక్క తెలుగు సినిమా పరిశ్రమ లోనే కాకుండా తమిళం, హిందీ పరిశ్రమల్లో కూడా ప్రముఖంగా వినబడుతున్న పేరు శోభిత ధూళిపాళ్ళ. ఐతే ఆమె అక్కినేని నాగ చైతన్య తో ప్రెసెంట్ ప్రేమ లో ఉందని పుకార్లు సోషల్ మీడియాయ వేదికగా వినబడుతున్నాయి అన్న విషయం అందరికి తెలిసిందే.

ఐతే సమంత నుండి డైవర్స్ తీస్కొని విడి పోయిన తర్వాత నాగ చైతన్య కొంత కాలం పాటు ఒంటరి జీవితాన్ని గడిపాడు. ఆ వెంటనే శోభిత ధూళిపాలతో ప్రేమాయణం మొదలు పెట్టాడని ప్రచారం కూడా సాగుతోంది.ఐతే ఆ విషయం పక్కన పెడితే ఇటీవల ఒక ముఖాముఖీ సంభాషణలో  శోభిత ధూళిపాళ్ల మాట్లాడుతూ తన అందం విషయంలో కెరియర్ ఆరంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఐతే తనకు ఇరవై సంవత్సరాల వయసులో ముంబైలోని ఒక యాడ్ ఏజెన్సీ కి వెళ్లానని ఐతే వారు ఒక షాంపూ చిత్రీకరణ చేస్తున్నట్లుగా తెలిసి అందులో అవకాశం కోసం అడిగానని చెప్పుకొచ్చింది.

ఐతే ఆ టైం లో వారు మీ యొక్క ఫేస్ బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరాదంటూ ఘోరంగా అవమానించి పంపించారు. బ్యాగ్రౌండ్ మోడల్ గా కూడా పనికి రాదంటూ అవమానించిన కంపెనీ వాళ్లే ఆ తర్వాత నన్ను రెండు సంవత్సరాలకు గాను బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసుకున్నారని పేర్కొంది.ఐతే చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని శోభిత ధూళిపాళ్ల చెప్పుకొచ్చింది. మొదట హిందీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈమె గూఢచారి సినిమా లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ మధ్య తమిళంలో విడుదల అయిన భారీ చిత్రం పొన్నియన్ సెల్వన్ లో కూడా కనిపించిన విషయం తెలిసిందే. ఐతే ఇక ఆమె తెలుగు లో ప్రెసెంట్ వరుసగా నటిస్తోంది. హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించేందుకు ఈమె ఓకే చెప్తోంది. వరుసగా సినిమాలు చేస్తున్న శోభిత ప్రెసెంట్ కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఈ తెనాలి ముద్దుగుమ్మ ముందు ముందు మరిన్ని తెలుగు సినిమా లు చేయాలని అభిమానులు మరియు శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

ఏదేమైనా ఈమెకు మరియు నాగ చైతన్య కు ఉన్నా రిలేషన్ గూర్చి పక్క ఇన్ఫర్మేషన్ ఐతే లేదని చెప్పాలి. చూద్దాం దీని గూర్చి వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: