పూరి జగన్నాథ్ సినిమా లైగర్ తీవ్రంగా నిరాశ పరచిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూ. 100 కోట్ల కు పైగా బడ్జెట్ ఖర్చు చేసి దర్శకుడు పూరి జగన్నాథ్ సొంతం గా అయితే నిర్మించాడు.

సినిమా పూరి జగన్నాథ్ కెరీర్ లోనే కాకుండా హీరో విజయ్ దేవరకొండ కెరియర్ కి కూడా పెద్ద డామేజ్ ని క్రియేట్ చేసింది అనడం లో సందేహం లేదు. ఆ సినిమా ఫెయిల్ అవ్వడం తో పూరి జగన్నాథ్ తదుపరి సినిమా విషయం లో ఎటు కూడా తేల్చుకోలేక పోతున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయి ఉంటే కనుక ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరో గా జనగణమన సినిమా అయితే మొదలు పెట్టేవాడు. కానీ ఆ సినిమా క్యాన్సిల్ అయింది. వెంటనే మరో యంగ్ హీరో వద్ద కు కథ తీసుకొని పూరి జగన్నాథ్ వెళ్ళాడటా.. కానీ ఆయన కూడా నో చెప్పాడని వార్తలు కూడా వస్తున్నాయి.

ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లు డేట్లు ఇచ్చేందుకు పూరి జగన్నాథ్ కి ఓకే చెప్పారు అని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ విషయం పై ఎలాంటి క్లారిటీ లేదు. అసలు పూరి జగన్నాథ్ తదుపరి సినిమా ఏంటి అనే విషయం లో ఎప్పటికి కూడా క్లారిటీ వస్తుంది అనేది తెలియడం లేదు. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. వెంటనే మరో సినిమా కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక చిరంజీవి విషయాన్ని చెప్పుకోవడానికి కూడా ఏమి లేదు. వరుసగా ఎన్నో సినిమాల్లో ఆయన నటిస్తూనే ఉన్నాడు. ఆయన సినిమా ల జాబితా తీస్తే మాత్రం చాలా పెద్దగానే ఉంది. అందుకే మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లు ఇప్పట్లో పూరి జగన్నాథ్ కి డేట్లు ఇచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే పూరి జగన్నాథ్ మరి కొంత కాలం వెయిట్ చేయాలి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: