మళయాళ భామ అయిన భావన కెరీర్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత మళ్లీ వరుస సినిమాలతో బాగా సత్తా చాటుతుంది. తెలుగు లో కూడా ఆమెని చేసిన ఒంటరి మరియు మహాత్మ సినిమాల తో ఇక్కడ ప్రేక్షకులకు ఆమె బాగా దగ్గరైంది.

ఆ మధ్య తనపై జరిగిన లైంగిక దాడి కేసుపై కూడా నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది భావన. ఆ తర్వాత బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుని కెరీర్ లో సెటిల్ అయింది. అయితే హీరోయిన్ గా కాకపోయినా స్పెషల్ రోల్స్ కూడా చేస్తూ వస్తుంది భావన. ఈ క్రమంలో తెలుగులో కూడా భావనకి వరుస ఛాన్స్ లు వస్తున్నాయి.

నిర్మాత భావన తో ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.. అది కాస్త బోల్డ్ గా ఉంటుందని సమాచారం.భావన కి తెలుగు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని తెలుస్తుంది.. ఈ సినిమా తెలుగుతో పాటుగా మళయాళం లో కూడా విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన డీటైల్స్ త్వరలో  అయితే బయటకు వస్తాయి. భావన లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడం నిజమైతే మాత్రం ఆమె ఫ్యాన్స్ కి పండుగ అని చెప్పొచ్చు. మరి భావన చేస్తున్న ఈ సినిమా ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి మరి.. ఇంతకీ ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు మిగతా స్టార్ కాస్ట్ ఎవరూ అన్నది త్వరలో నే అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం.ఈ సినిమా తో మళ్ళీ తెలుగులో అవకాశాలు తెచ్చుకోవాల ని  చూస్తుంది భావన. తెలుగు లో శ్రీకాంత్ సరసన కృష్ణ వంశీ దర్శకత్వం లో వచ్చిన మహాత్మా సినిమా ఆమెకు మంచి విజయం సాధించి పెట్టింది. ఆ తరువాత కొన్ని సినిమాలలో నటించిన అవి అంతగా మెప్పించలేకపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: