సినిమాలలో రాజకీయాలలో పరాజయాలు రావడంతో కమల్ హాసన్ కెరియర్ ముగిసిపోయింది అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. అలా అభిప్రాయ పడ్డవారికి గత సంవత్సరం విడుదలైన ‘విక్రమ్’ మూవీతో గట్టి సమాధానం కమల్ హాసన్ ఇచ్చాడు. ఈమూవీ దేశవ్యాప్తంగా 4వందల కోట్లు కలెక్ట్ చేయడంతో గతసంవత్సరం బ్లాక్ బష్టర్ లిస్టులోకి ఈమూవీ చేరిపోయింది.
66 సంవత్సరాల కమలహాసన్ తన వయసును లెక్క చేయకుండా ఈమూవీలో చేసిన భారీ యాక్షన్ సీన్స్ కు ఈనాటితరం ప్రేక్షకులు ఆశ్చర్యపడ్డారు. ఈమూవీ ఇచ్చిన ఉత్సాహంతో కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన ‘భారతీయుడు 2’ తరిగి ప్రారంభం కావడమే కాకుండా ఈమూవీని ఈ సంవత్సరం దీపావళికి విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈమూవీలో కమల్ 80 సంవత్సరాల వృద్ధుడుగా కనిపించడానికి షూటింగ్ కు ముందు నాలుగు గంటలు మేకప్ కు కేటాయిస్తున్నాడు అంటే నటన పట్ల అతడికి ఉన్న శ్రద్ధ తెలియచేస్తుంది.
శంకర్ దర్శకత్వంలో 5వందల కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీకి సంబంధించిన ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు లీక్ అయింది. ఈసినిమాలో ఏడుగురు విలన్స్ ఉంటున్నారని సమాచారం. వీరితోపాటు కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా భవానీ శంకర్ సిద్ధార్థ్ గుల్షన్ గ్రోవర్ నెదురుమూడి వేణు సముద్రఖని బాబీ సింహ గురు సోమసుందరం ఢిల్లీ గణేష్ మరిముత్తు వెన్నెల కిషోర్ లు కూడ నటిస్తున్నారు.
వాస్తవానికి ఈసినిమాలో విలన్స్ ఎవరు అన్నది చివరి వరకు సస్పెన్స్ లో ఉంచుతారట. ఈసినిమాకు సంబంధించిన క్లైమాక్స్ ను త్వరలో చిత్రీకరిస్తారని టాక్. ఈ క్లైమాక్స్ చిత్రీకరణకు సుమారు 20 రోజులు సమయం కేటాయించడం బట్టి ఈమూవీ క్లైమాక్స్ ఏస్థాయిలో ఉంటుందో అంచనాలు వేసుకోవచ్చు. శంకర్ సినిమాలు అంటేనే గ్రాఫిక్ మాయాజాలం ఎక్కువగా ఉంటుంది. ఈమూవీలోని గ్రాఫిక్స్ కోసమే సుమారు 150 కోట్లు ఖర్చు పెడుతున్నారని టాక్. పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈసినిమాను దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడ ఒకేసారి విడుదల చేస్తున్నారు..
మరింత సమాచారం తెలుసుకోండి: