
అందుకే మార్చి మూడో వారంలో లాంచ్ చేసి ఏప్రిల్ లో రెగ్యులర్ గా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు కాబట్టి ఎన్టీఆర్ ఆస్కార్ నుంచి తిరిగి రాగానే కొరటాల శివా నుంచి ఎలాంటి అప్డేట్ ఉండకపోవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ మరో రెండు రోజుల్లో ఒక గుడ్ న్యూస్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నది. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ను తీసుకోబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అధికారికంగా ఈ విషయం పైన ప్రకటించలేదు.
అయితే తాజాగా అప్డేట్ ప్రకారం మార్చి ఆరవ తేదీన ఈ సినిమా పైన ఆఫీసియల్ గా అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు సమాచారం. ఆరోజు ఎన్టీఆర్ అమెరికాకు వెళుతున్నారు మరి అప్డేట్ ఎలా అనుకుంటే అయితే ఇక్కడే అసలు మ్యాటర్ ఉందట.. మార్చి ఆరవ తేదీన జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 సినిమాలో ఏమైనా కన్ఫామ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి అందుకు సంబంధించి ఫోటోషూట్లు కూడా జరిగినట్లు తెలుస్తోంది. కాబట్టి ఆ రోజున ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించి జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. దీంతో ఎట్టకేలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కాస్త ఊరట ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.